చాణక్య నీతి: మీ పిల్లల ప్రవర్తనలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే వెంటనే ఈ పని చేయండి..!

చాణక్య నీతి: మీ పిల్లల ప్రవర్తనలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే వెంటనే ఈ పని చేయండి..!

by Megha Varna

Ads

చాణుక్యుడు ఎంతటి మహాజ్ఞానో మనందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆర్థిక సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు. ఈయన చెప్పిన నీతి వాక్యాలు నేటికీ చిరస్మరణీయాలు. వాటిని తరువాతి తరానికి కూడా అందచేసి.. మంచి భవిష్యత్ ను రూపొందించుకునేలా తోడ్పడాలి.

Video Advertisement

చాణక్య నీతి ఎన్నో ముఖ్యమైన విషయాలు చెబుతోంది. ఈ అలవాట్లు కనుక పిల్లల్లో ఉంటే తప్పకుండా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చెయ్యకూడదు ఆని చాణక్యనీతి చెబుతోంది. కనుక పిల్లల్లో కనుక ఈ అలవాట్లు ఉంటే తల్లిదండ్రులు వాటిని మార్చాలి. లేదంటే తల్లిదండ్రులుగా మీరు విఫలమైనట్లు.

#1. అబద్ధాలు చెప్పే పిల్లలు:

మీ పిల్లలు మీతో అబద్ధం చెప్తున్నారని మీకు అనిపిస్తే వాళ్లని సరి చేయండి. ఆ అలవాటును తొలగించడానికి ప్రయత్నం చేయాలి. అబద్ధం చెప్పేటప్పుడు మీరు వాటిని గమనించి వాళ్ళకి తప్పు అని చెప్పకపోతే.. ఆ అలవాటు జీవితాంతం ఉండిపోతుంది. కాబట్టి తల్లిదండ్రులు తప్పకుండా సరి చేయాలి.

#2. మొండిగా వుండే పిల్లలు:

చాలామంది పిల్లలు మొండిగా ప్రవర్తిస్తుంటారు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక వాళ్ళు చెప్పినదానికి తలాడిస్తూ ఉంటారు. అది కనుక ఒకసారి అలవాటైపోయింది అంటే ఇక వాళ్ళు అస్సలు మీ మాట వినరు. కాబట్టి ఎప్పుడూ కూడా పిల్లల్ని మితిమీరి ముద్దు చేయొద్దు. అలా చేస్తే మొండితనం మరింత ఎక్కువైపోతుంది కనుక ఈ సమస్యను కూడా పరిష్కరించుకోవాలి.

#3. పిల్లల ముందు గొడవపడద్దు:

భార్యభర్తలు పిల్లలు ముందు గొడవ పడితే వాళ్ళలో కోపం, చికాకు పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా వాళ్ళ ముందు గొడవ పడొద్దు. వాళ్లకి ఇన్స్పిరేషన్ తీసుకురావాలి. అలానే వాళ్లకి గొప్ప వ్యక్తుల గురించి చెప్పండి. ఉత్తమ పౌరులుగా మార్చండి.


End of Article

You may also like