ఈ రైల్వే స్టేషన్ కి వెళ్లాలంటే వీసా అవసరమట.. ఈ స్టేషన్స్ కి పేర్లే లేవట.. భారతదేశంలో ఉన్న ఈ 5 రైల్వేస్టేషన్లని చూస్తే మతిపోతుంది..!

ఈ రైల్వే స్టేషన్ కి వెళ్లాలంటే వీసా అవసరమట.. ఈ స్టేషన్స్ కి పేర్లే లేవట.. భారతదేశంలో ఉన్న ఈ 5 రైల్వేస్టేషన్లని చూస్తే మతిపోతుంది..!

by Megha Varna

మీరు సాధారణ రైల్వే స్టేషన్లని చూసి ఉండొచ్చు కానీ ఇలాంటి వింత రైల్వే స్టేషన్స్ ని చూసి ఉండరు. ఏ రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి అన్న ప్లాట్ఫాం టికెట్ ఉంటే సరిపోతుంది. కానీ ఈ రైల్వే స్టేషన్ కి వెళ్లాలంటే తప్పకుండా వీసా ఉండాలి. అవును మీరు చూసింది నిజమే.

Video Advertisement

ఈ రైల్వే స్టేషన్ కి వెళ్లాలంటే తప్పక వీసా ఉండాలి. పంజాబ్ లోని అటారీ రైల్వే స్టేషన్ కి వెళ్లాలంటే కచ్చితంగా వీసా ఉండాలి. ఎందుకంటే ఇది భారత దేశానికి పాకిస్తాన్ కి సరిహద్దుల్లో పంజాబ్లోని అమృత్సర్ లో ఉంది. సెక్యూరిటీ ని దృష్టిలో పెట్టుకుని ఈ రూల్ ని పెట్టారు. ఈ రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి అంటే తప్పక వీసా ఉండాలి.

ఇది ఇలా ఉంటే అన్ని రైల్వేస్టేషన్ల కి పేర్లు ఉంటాయి కదా.. కానీ ఈ రైల్వే స్టేషన్ కి మాత్రం పేర్లు ఉండవట. అదేంటి పేరు లేకుండా రైల్వే స్టేషన్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారా..? అది కూడా మన దేశం లోనే ఉందండి. పశ్చిమ బెంగాల్లోని బంకురా మధ్యన ఒక రైల్వే స్టేషన్ ఉంది. దానికి పేరు లేదు.

మొదట దీనిని రైనగర్ అని పిలిచేవారు. కానీ పక్కనే ఉన్న గ్రామస్తులు వాళ్ళ పేరుతో రైల్వే స్టేషన్ పెట్టాలని గొడవ చేశారు. రెండు ఊళ్ళ మధ్య గొడవలు రావడంతో మొత్తానికి పేరునే తీసేశారు. అప్పటి నుండి ఈ స్టేషన్ కి పేరే లేదు.  అదేవిధంగా జార్ఖండ్ లో మరో పేరు లేని రైల్వే స్టేషన్ ఉంది. మొదట దీనిని బక్రీచంపి అని పిలిచేవాళ్ళు. కానీ స్థానికులు ఆందోళన చేయడంతో దానిని తొలగించేశారు. ఈ రైల్వే స్టేషన్ కి కూడా పేరు లేదు ఇప్పుడు.

మరో అరుదైన రైల్వే స్టేషన్ ఉంది. అదే నవపూర్ రైల్వే స్టేషన్. మహారాష్ట్ర, గుజరాత్ సరిహద్దుల్లో ఈ ప్రాంతం ఉంది. ఇక్కడ రైల్వే స్టేషన్ లోని బెంచీ మధ్యలోంచి మహారాష్ట్ర గుజరాత్ సరిహద్దు రేఖ వెళ్ళింది. దీనితో బెంచిలో సగం మహారాష్ట్ర లో వుంటే.. మరో సగం గుజరాత్ లో ఉంటుంది. అందుకే ఈ బెంచీమీద రెండు రాష్ట్రాల పేర్లు కూడా రాసి ఉంటాయి.

ఈ స్టేషన్లో టిక్కెట్ కౌంటర్ మహారాష్ట్ర కిందకి వస్తుంది. కానీ వెయిటింగ్ రూమ్, స్టేషన్ మాస్టర్ ఆఫీస్లు గుజరాత్ లోకి వస్తాయి. పైగా ఇక్కడ రైల్వే స్టేషన్ వాళ్ళు అనౌన్స్మెంట్లని హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, గుజరాతీ భాషల్లో చేస్తారు. ఎంత విడ్డూరంగా వుందో కదా..?

అలానే రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో భవాని మండి అని ఒక రైల్వే స్టేషన్ ఉంది. అయితే అది కూడా చాలా స్పెషల్ ఎందుకంటే ఈ స్టేషన్ లో ఏదైనా రైలు ఆగితే ఇంజన్ ఒక రాష్ట్రంలో బోగీలు మరో రాష్ట్రంలో ఉంటాయి. టికెట్ తీసుకున్న ప్రయాణికులు మధ్యప్రదేశ్లో ఉంటే టికెట్ కౌంటర్ మాత్రం రాజస్థాన్లో ఉంటుంది.


You may also like