CANCER: ఈ లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకండి.. క్యాన్సర్ కావచ్చు జాగ్రత్తపడండి!

CANCER: ఈ లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకండి.. క్యాన్సర్ కావచ్చు జాగ్రత్తపడండి!

by Harika

Ads

క్యాన్సర్ అనేది ఒకప్పుడు చాలా తక్కువ మందికి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్కడ చూసినా క్యాన్సర్ అనే మాట వినిపిస్తోంది. మనకి క్యాన్సర్ ఉంది అనే విషయాన్ని తెలుసుకునేసరికి అది చికిత్సకి అందని దశకి వెళ్ళిపోతుంది. అయితే క్యాన్సర్ సోకే ముందు శరీరానికి కొన్ని లక్షణాలు ఏర్పడతాయి వాటిని గ్రహించినట్లయితే ప్రారంభ దశలోనే వ్యాధిని నయం చేసుకోవచ్చు. మీకు తరచుగా కడుపునొప్పి రావడం, చికిత్స తీసుకున్నప్పటికీ ఏమాత్రం ఉపశమనం లభించకపోవడం జరిగినట్లయితే దానిని అశ్రద్ధ చేయకండి. అది పెద్ద పేగు క్యాన్సర్ అయి ఉండవచ్చు జాగ్రత్త పడండి.

Video Advertisement

things to kow about brest cancer..

కిడ్నీలో ఎలాంటి సమస్య లేకపోయినా మూత్ర సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెడుతుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ పరీక్ష చేయించుకోండి. రొమ్ములో గడ్డలు ఏర్పడి అవి చికిత్స చేయించుకున్నప్పటికీ ఉపశమనం లభించకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోండి. అలాగే క్యాన్సర్ వ్యాధి సోకే సమయంలో శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి కానీ వాటిని మనం పెద్దగా పట్టించుకోము. అలాంటి లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. కారణం లేకుండా అకస్మాత్తుగా బరువు తగ్గిపోవటం క్యాన్సర్ లక్షణం అంటున్నారు వైద్యులు. రోజుల వ్యవధిలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ కేజీల బరువు తగ్గిపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించండి.

ఎందుకంటే ఊపిరితిత్తుల క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, కడుపు క్యాన్సర్ వంటి క్యాన్సర్లు ఎటాక్ అయ్యే సందర్భాలలో ఇలా జరుగుతుంది. అలాగే మీ శరీరంలో ఏవైనా గడ్డలు ఏర్పడి అవి నొప్పి లేకుండా నిరంతరం పెరుగుతూ ఉంటే అది క్యాన్సర్ లక్షణమే. 90 శాతం వరకు లక్షణాలు ఉన్న వ్యక్తులకు క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. అలాగే సాధారణంగా క్యాన్సర్ పేషంట్లకి జ్వరం వస్తుంది, క్యాన్సర్ పుట్టి అది ఇతర శరీర భాగాలకు స్ప్రెడ్ అయ్యేటప్పుడు కూడా జ్వరం వస్తూ ఉంటుంది.

తేలికపాటి జ్వరం శరీరంలో ఉండి మందులు తీసుకోవడం ద్వారా నయమవుతుంది కానీ మళ్ళీ వచ్చినట్లయితే అది క్యాన్సర్ లక్షణం కావచ్చు, కాబట్టి జాగ్రత్త పడండి. మలంలో రక్తం పడితే పెద్ద పేగు క్యాన్సర్ కు కారణం కావచ్చు. మూడు వారాలకు మించి దగ్గు తగ్గకపోతే డాక్టర్ని సంప్రదించండి ఎందుకంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ కి ఇది సంకేతం. శరీరానికి చిన్న గాయం అయినా ఎక్కువ కాలం మానకపోతే అది చర్మ కేన్సర్ కి సంకేతం. పులిపిర్లు పెరిగి వాటినుండి రక్తం కారుతుంటే కూడా అశ్రద్ధ చేయద్దు అంట. చర్మ క్యాన్సర్‌ లక్షణాలని గ్రహించి వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.


End of Article

You may also like