ఈ నూనెల వలన క్యాన్సర్ రిస్క్ వుంది… జాగ్రత్తగా వుండండి..!

ఈ నూనెల వలన క్యాన్సర్ రిస్క్ వుంది… జాగ్రత్తగా వుండండి..!

by Megha Varna

Ads

నూనె ఎక్కువగా ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది కాదన్న సంగతి అందరికీ తెలుసు. అయినప్పటికీ కొన్ని వంటలు నూనె లేకుండా అవ్వవు. ఏది ఏమైనా వీలైనంత వరకు నూనెను తగ్గించుకుంటే మంచిది. ఎక్కువగా నూనె ఉపయోగించడం వల్ల మనకి ఇబ్బందులు వస్తాయి.

Video Advertisement

ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ అయ్యాయి. నిజానికి ప్రపంచంలో అత్యధిక ప్రాణాంతక వ్యాధులలో క్యాన్సర్ రెండోస్థానం లో ఉంది.

ప్రతి సంవత్సరం కోట్లాది మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే నూనె వలన కూడా క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధికంగా నూనెలు తీసుకోవడం వల్ల శరీరంలో పీహెచ్ సమతుల్యతను దెబ్బతీస్తుంది. అలానే నూనె ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఊబకాయం, కొలెస్ట్రాల్, మలబద్దకం, డైజెస్టివ్ సిస్టం లో అల్సర్స్, పైల్స్ వంటి సమస్యలు కలిగే అవకాశం ఉంది.

ఈ నూనెలను ఉపయోగించడం వల్ల క్యాన్సర్ ముప్పు కలుగుతుంది:

మొక్కజొన్న నూనె, సోయాబీన్ నూనె, పొద్దుతిరుగుడు నూనె, పామాయిల్ వంటి వాటిని వేడి చేస్తే ఆల్డిహైడ్లు రిలీజ్ అవుతాయి. వీటి వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఎన్నోరకాల భయంకరమైన క్యాన్సర్స్ రావడానికి ఈ నూనెలు కారణమవుతాయి.

కాబట్టి ఈ నూనెలను తగ్గించడం మంచిది. ఈ నూనెలలో పాలీ అన్సాచ్యురేటెడ్ కొవ్వు అధిక పరిణామాల్లో ఉండడం వలన వేడి చేసినప్పుడు ఆల్డిహైడ్‌గా విచ్చిన్నమవుతుంది. కాబట్టి ఇటువంటి నూనెలకు దూరంగా ఉండటం మంచిది. లేదంటే క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది.

ఆల్డిహైడ్స్ ఆలివ్ నూనె లో తక్కువగా ఉంటాయి కాబట్టి వంటలకు ఆలివ్ ఆయిల్ ని వాడితే మంచిది లేదంటే చక్కగా వెన్నని ఉపయోగించండి. వెన్నని ఉపయోగించి వంట చేసుకోవడం వల్ల క్యాన్సర్ రిస్కు తగ్గుతుంది కాబట్టి వీలైనంత వరకు ఈ నూనెలకి దూరంగా ఉండి ఆరోగ్యంగా వుండండి. సమస్యలకు దూరంగా వుండండి.


End of Article

You may also like