37 ఏళ్ల తర్వాత కూడా వీళ్ళకి అయోధ్యలో ఇంత గౌరవం ఇస్తున్నారు..! వీళ్ళు ఎవరో తెలుసా..?

37 ఏళ్ల తర్వాత కూడా వీళ్ళకి అయోధ్యలో ఇంత గౌరవం ఇస్తున్నారు..! వీళ్ళు ఎవరో తెలుసా..?

by Mounika Singaluri

Ads

1987- 1988 మధ్య డిడి నేషనల్ లో ప్రచారం చేయబడిన ధారవాహిక రామాయణం. ఇది ఆ రోజుల్లో ఎంతగా పాపులర్ అయిందంటే ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించబడిన టెలివిజన్ సిరీస్ గా మారింది. దీనికి 82% వీక్షకులు ఉన్నారు.

Video Advertisement

రిపీట్ టెలికాస్ట్ మొత్తం ఐదు ఖండాల్లో, 17 దేశాలలో 20 వేరు వేరు చానల్లో వేరు వేరు సమయాల్లో ప్రసారం చేయబడింది. ఈ సిరీస్ విజయాన్ని మీడియా చక్కగా నమోదు చేసింది. బీబీసీ ప్రకారం ఈ సీరియల్ ను 650 మిలియన్లకు పైగా వీక్షితులు వీక్షించారు.

 

సిరీస్ యొక్క ప్రతి ఎపిసోడ్ కి డిడి నేషనల్ 40 లక్షలు సంపాదించినట్లు నివేదించింది. ఈ ధారావాహికను సాగర్ ఆర్ట్స్ నిర్మించింది విష్ణువు యొక్క ఏడవ అవతారం అయిన రాముని కథ ఇది. రాక్షస రాజు రావణుడు నుంచి అతని భార్య సీతను రక్షించడానికి అతను చేసిన ప్రయాణాన్ని చిత్రీకరించింది. ఈ ధారవాహిక హిందూ మతంలోని పవిత్ర గ్రంథం అయిన వాల్మీకి రామాయణం యొక్క కథనాన్ని అనుసరించింది. ఇది రాముడు అతని సోదరుడు లక్ష్మణుడు అంకితభావం గల వానర దేవుడు హనుమంతుడు ఎదుర్కొన్న వివిధ సాహసాలు సవాళ్లను చిత్రీకరించింది.

these people are respected in ayodhya

ఈ కథలో రాముడు వనవాసం రావణుడు సీతను అపహరించడం లంకకు వంతెనను నిర్మించడం రాముడు రావణుడి మధ్య యుద్ధం చివరికి రాముడు తన రాజ్యమైన అయోధ్యకు విజయవంతంగా తిరిగి రావడం వంటి కథలను కలిగి ఉంటుంది. ఈ సీరియల్ లో రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చికాలియా నటించారు. ఇక సునీల్ లహరి, అరవింద్ త్రివేది, ధారాసింగ్ వారి వారి పాత్రలకు తగ్గట్టు నటనతో సీరియల్ ని ఒక రేంజ్ కి తీసుకువెళ్లారు.

ఈ సీరియల్ కి డైరెక్టర్ రామానంద్ సాగర్ కాగా స్వరకర్త రవీంద్ర జైన్. నిర్మాతలుగా రామానంద సాగర్, ఆనంద్ సాగర్, మోతీసాగర్ వ్యవహరించారు. ఇక ఈ సీరియల్ లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ ని అయితే ఆ రోజులలో సాక్షాత్తు దేవుడి గానే భావించేవారు జనాలు. ఎక్కడ కనిపించినా హారతులు బట్టి బ్రహ్మ రథం పట్టేవారు. అంతటి చరిత్ర కలిగిన వారు కాబట్టే ఆ నటీనటులని అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకి ఆహ్వానం లభించింది. అయోధ్యలో వారికి లభిస్తున్న ఆదరణ చూస్తుంటే ఇన్ని రోజుల తర్వాత కూడా వీళ్ళకి ఇంత గౌరవమా అని ఆశ్చర్యం కలగక మానదు.

watch video :

https://www.instagram.com/reel/C2OsqZORmEc/?igsh=NjZiM2M3MzIxNA==


End of Article

You may also like