Ads
మన భారతదేశంలో ఎక్కువ మంది ఉపయోగించే ఈ ప్రొడక్ట్స్ ని విదేశాలలో బ్యాన్ చేశారట. అయితే మరి మనం మాత్రం నిత్యం ఈ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తూ ఉన్నాం. అయితే విదేశాలలో బ్యాన్ చేసి మన దేశాల్లో ఉపయోగిస్తున్న ఆ ప్రొడక్ట్స్ గురించి ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1. కోల్గేట్:
మన రోజు కోల్గేట్ తో మొదలవుతుంది. చాలా మంది ఉదయాన్నే బ్రష్ చేయడానికి కోల్గేట్ ని వాడతారు. కానీ కోల్గేట్ అడ్వటైజ్మెంట్ లని యూకేలో బ్యాన్ చేశారు. దాదాపు ఒక సంవత్సరంలో 9 యాడ్స్ వరకు బ్యాన్ చేశారు. మొజాంబిక్ లో అయితే కోల్గేట్ పేస్టుని బ్యాన్ చేశారు. ఎందుకంటే ఇందులో కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయని. దీని వల్ల ఆరోగ్యం పాడవుతుంది అని బ్యాన్ చేశారు. ఆ తర్వాత కోల్గేట్ కెమికల్స్ ఎక్కువ లేవని ప్రూవ్ చేసుకుంది. దీంతో ప్రోడక్ట్ ని తిరిగి మళ్లీ వాడుతున్నారు.
#2. లైఫ్ బాయ్:
లైఫ్ బాయ్ సబ్బు మనదేశంలో చాలామంది వాడుతున్నారు. కానీ అమెరికా మరియు యూరోపియన్ దేశాలలో ఈ సబ్బుని చాలా సంవత్సరాల క్రితం బ్యాన్ చేశారు. ఎందుకంటే ఈ సబ్బులో కార్బోనిక్ యాసిడ్ ఉంటుంది అని. దీనిని బొగ్గు మరియు తార్ ద్వారా తీస్తారు. దీనివల్ల చర్మానికి హాని కలుగుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం కార్బోనిక్ యాసిడ్ ని ఉపయోగించడం మానేసింది ఈ కంపెనీ.
#3. తేనె:
చాలా రకాల కంపెనీలు తేనెను తయారు చేసి అమ్ముతూ ఉంటారు. అయితే ఇండియా నుంచి విదేశాలకు వెళ్లిన తేనెని జర్మనీలో పరిశీలించగా.. భారతదేశంలో ఉన్న టాప్ 10 కంపెనీలు కూడా ఆ టెస్ట్ లో ఫెయిల్ అయ్యాయి. హనీ బ్రాండ్ లో షుగర్ సిరప్ ని ఉపయోగించి కల్తీ చేస్తున్నారు. చాలా రకాల ఇండియన్ తేనెలని యుఎస్ మరియు యుకె లో బ్యాన్ చేశారు.
#4. విక్స్:
విక్స్ ని కూడా యూరోపియన్ మరియు ఉత్తర అమెరికా లో బ్యాన్ చేశారు. ఇందులో ఉపయోగించే మెడిసిన్ మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ విక్స్ ని ఉపయోగించడం వల్ల ఆస్తమా, టీబీ సమస్య వచ్చే అవకాశం ఉంది. విక్స్ ఇన్హేలర్ ని జపాన్ లో బ్యాన్ చేశారు. అలానే విక్స్ కి సంబంధించిన కొన్ని మందులు కూడా బ్యాన్ చేశారు.
#5. పచ్చి పాలు:
పచ్చి పాలుని మన భారతదేశంలో అమ్ముతూ ఉంటారు కానీ విదేశాలలో అలా అమ్మడం తప్పు. కెనడాలో పచ్చిపాలని అస్సలు అమ్మకూడదు. ఒకవేళ ఎవరైనా అమ్ముతూ కనపడితే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. పచ్చిపాలని ప్యాక్ చేయడం వల్ల అందులో బ్యాక్టీరియా పెరుగుతుండటంతో సమస్యలు వస్తాయి.
#6. పెస్టిసైడ్స్:
వీటిని కూడా విదేశాలలో బ్యాన్ చేశారు. భవిష్యత్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని 400 రకాల పెస్టిసైడ్స్ ని బ్యాన్ చేశారు. అయితే అక్కడ బ్యాన్ చేసిన 60 రకాల పెస్టిసైడ్స్ ని మన భారతదేశంలో వాడుతున్నారు.
#7. చూయింగ్ గమ్స్:
చూయింగ్ గమ్ ని కూడా మనదేశంలో అమ్ముతారు. కానీ సింగపూర్ చూయింగ్ గమ్స్ ని బ్యాన్ చేసింది. ఎక్కడపడితే అక్కడ చూయింగ్ గుమ్స్ ఉండడం వలన ఇబ్బంది కలుగుతుందని.. పైగా వీటిని శుభ్రం చేయడానికి సంవత్సరానికి లక్ష డాలర్లు ఖర్చు అవుతోంది. అందుకే అక్కడ బ్యాన్ చేశారు.
#8. రెడ్ బుల్:
మన భారతదేశంలో రెడ్ బుల్ దొరుకుతుంది. అయితే ఇందులో ఉండే ఒక అమైనో ఆసిడ్ వలన ఫ్రాన్స్, నార్వే, డెన్మార్క్ లో బ్యాన్ చేశారు. ఈ టౌరిన్ అనే ఎమైనో యాసిడ్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
End of Article