Ads
పూర్వం కంటే ఇప్పుడు అనారోగ్య సమస్యలు మరింత ఎక్కువైపోయాయి. 30 ఏళ్లు దాటగానే మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు మొదలైన సమస్యలు వస్తున్నాయి. నిజానికి కాస్త పని చేస్తే చాలు అలసి పోతున్నాము. ఏదైనా పెద్ద పనులు చేయాలంటే అసలు సహకరించడం లేదు.
Video Advertisement
కొంచెం దూరం నడవాలి అన్నా లేదంటే ఎక్కువ మెట్లు ఎక్కాలి అన్నా కూడా ఇబ్బందిగానే ఉంటుంది. మీరు కూడా ఇలానే ఇబ్బంది పడుతున్నారా..? వాటి నుండి బయట పడాలని అనుకుంటున్నారా..? అయితే తప్పని సరిగా దీని కోసం చూడాల్సిందే.
ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కేవలం మూడు పదార్థాలతో పొందొచ్చు. మరి ఇక వాటి కోసం ఇప్పుడే తెలుసుకుందాం. ఈ మూడు పదార్థాలతో మీరు టీ తయారు చేసుకొని తీసుకుంటే చక్కని ప్రయోజనం పొందవచ్చు.
ఈ టీ ని తయారు చేసుకోవడానికి 250 మిల్లీలీటర్ల నీళ్ళలో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ సోంపు, అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి.
మంచి సువాసన వచ్చే దాకా దీనిని మరిగించండి.
ఆ తర్వాత మీరు ఈ మిశ్రమాన్ని వడకట్టేసి అందులో కొంచెం తేనె, నిమ్మరసం వేసుకుని తీసుకోండి.
ఖాళీ కడుపున ఈ విధంగా తీసుకోవడం వల్ల అద్భుతమైన ఉపయోగాలు మీరు పొందొచ్చు.
ఈ లాభాలను పొందొచ్చు:
జీలకర్ర, ధనియాలు జీర్ణశక్తిని బాగా పెంచుతాయి.
ధనియాలు మీ బాడీని కూల్ చేస్తాయి. అలాగే శరీరంలో ఉండే అధిక స్థాయి ఆసిడ్స్ ని కూడా తొలగిస్తాయి.
బాగా బరువు ఉన్నవాళ్లు ధనియాలు, జీలకర్ర కలిపి తీసుకుంటే బరువు తగ్గడానికి అవుతుంది.
అలానే హైడ్రేట్ గా ఉండడానికి కూడా అవుతుంది.
జలుబు సమస్య కోసం దీన్ని తీసుకునే వాళ్ళు నిమ్మరసం వేసుకోకండి.
పీరియడ్స్ సమయంలో ఈ టీ ని తాగడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి రాదు.
ఒత్తిడి నుండి కూడా రిలీఫ్ ని పొందొచ్చు.
అలానే కీళ్ల నొప్పులు, డయాబెటిస్, బీపీ వంటి సమస్యలు కూడా మీ దరి చేరవు.
End of Article