Ads
ఏ భార్యాభర్తల మధ్య అయినా సరే చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు సర్దుకుపోవాలి. అంతే కానీ వాటిని పెద్దవి చేసుకుని పోతే బంధం మరింత బలం బలహీనపడుతుంది. అయితే ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిది. ఈ మధ్య కాలంలో మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు దీనితో రెండిటినీ మ్యానేజ్ చేసుకోవడం కష్టమైపోతోంది.
Video Advertisement
నిజానికి భర్తలు ప్లేట్లో అన్నం పెడితే తింటారు కానీ ఆమె ఎంత శ్రమ పడుతుంది అని గుర్తించే వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. దీనితో మహిళలపై ఒత్తిడి ఎక్కువగా పడుతూ ఉంటుంది.
ఒక్కొక్కసారి నిజంగా పని ఎక్కువై సమయం కూడా సరిపోదు. ఒత్తిడి కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు కూడా వస్తూ ఉంటాయి. కానీ నిజానికి ఒకరికొకరు సహాయం చేసుకుంటే మంచిది. మీ భాగస్వామికి ఒత్తిడి తగ్గించేందుకు మీరు కూడా చూడాలి. మీ భార్య కూడా ఎక్కువగా ఇలా ఇబ్బంది పడుతుంటే ఈ చిట్కాలను తప్పక మీరు అనుసరించండి.
#1. ఇంటిని శుభ్రపరచడానికి సహాయం చేయండి:
ప్రతి స్త్రీ కూడా ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఆమె ఇంటిని శుభ్రం చేసినప్పుడు మీరు కూడా ఆమెకి చిన్న చిన్న పనులు చేసి పెట్టండి. నిజానికి మీకు పనులు చేయడం రాకపోయినా ఆమె చెప్పింది కొంచెం చేస్తే త్వరగా పని అయిపోతుంది. ఇలా మీరు ఇల్లు శుభ్రం చేయడంలో చిన్న చిన్న పనులు చేస్తే ఆమెకు ఒత్తిడి తగ్గుతుంది అలానే సమయం సేవ్ అవుతుంది.
#2. వంట గదిలో సాయం చేయండి:
కూరగాయలు కట్ చేయడం, ఫ్రిజ్ లో కూరలు సర్దడం లేదంటే డబ్బాల్లో కిరాణా సామాన్లు సర్దడం ఇలా మీకు తోచిన పని చేస్తే ఆమెపై పని భారం తగ్గుతుంది.
#3. పిల్లల్ని చూసుకోవడం:
ప్రతి తల్లికి కూడా పిల్లల్ని చూసుకోవడం అతిపెద్ద టాస్క్. ఆమె ఇంటి పనులతో బిజీగా ఉంటే మీరు సెల్ ఫోన్ లో లేదా టీవీలో నిమగ్నమై పోకుండా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. పిల్లల్ని చూసుకోవడం వల్ల కూడా ఆమెకు సహాయం చేసినట్టే. కాబట్టి భర్తలు ఇలా వారికి సహాయం చేస్తే పనులు త్వరగా అవుతాయి పైగా ఎంతో ప్రశాంతంగా ఉండగలరు. నిజానికి ఇంటి పనులు భార్యాభర్తలు కలిసి చేసుకుంటే వాళ్ళ మధ్య బంధం బలపడుతుంది కూడా.
End of Article