‘వాల్తేరు వీరయ్య’ పోర్ట్ సెట్ గురించి ఈ విషయాలు తెలుసా..??

‘వాల్తేరు వీరయ్య’ పోర్ట్ సెట్ గురించి ఈ విషయాలు తెలుసా..??

by Anudeep

Ads

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఎప్పుడు లేనంత స్పీడ్ గా వరుస సినిమాలు ప్రకటిస్తూ మెగా ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్నాడు.. మరో వైపు వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజ్ రవితేజతో తెరపంచుకోనుండటం ఆసక్తికరంగా మారింది. బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్నఈ సినిమాలో రవితేజ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Video Advertisement

 

 

అయితే వాల్తేరు వీరయ్య చిత్ర ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది టీం. ఇప్పటికే విడుదలైన పాటలు.. వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే చిరంజీవిని పక్కా మాస్ లుక్ తో చూడాలని కొంతకాలం నుంచి ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే ఈ చిత్రం లో చిరు ని అలాగే చూపించబోతున్నాడు దర్శకుడు బాబీ. ‘వాల్తేరు వీరయ్య’.. సముద్రం నేపథ్యంలో .. జాలరి గూడెం బతుకుల చుట్టూ తిరిగే కథ.

 

things behind waltair veerayya port set..!!
ఈ నేపథ్యం లోనే ఈ చిత్రం కోసం ఒక పోర్ట్ సెట్ ని డిజైన్ చేసారు ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్. ప్రకాశ్. ఈ సెట్ గురించి ఆయన మాట్లాడుతూ.. ” ఎప్పటినుంచో మెగాస్టార్ సినిమాకి వర్క్ చేయాలనేది నా డ్రీమ్. ఆ ముచ్చట ఈ సినిమాతో తీరింది. కథ వింటున్నప్పుడే సెట్ ఎలా ఉండాలనే ఒక విషయంలో నాకు క్లారిటీ వచ్చేసింది. ఫోర్ట్ సెట్ కి అయ్యే ఖర్చు నిర్మాతలకు అందుబాటులో ఉండాలి. అలాగే చిరంజీవిగారి క్రేజ్ కి తగినట్టుగా ఉండాలి. బడ్జెట్ పరిధి దాటకూడదు .. భారీతనం తగ్గకూడదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సెట్ వేయడం జరిగింది.” అని ఆయన తెలిపారు.

things behind waltair veerayya port set..!!

ఈ సెట్ కోసం రెండు నెలల పాటు 300 మంది నుంచి 400 మంది వరకూ రెగ్యులర్ గా పనిచేశారు. ఈ సినిమాలోని ఒక పాట కోసం వేసిన ఈ సెట్, ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది అని ఆర్ట్ డైరెక్టర్ వెల్లడించారు. మరో వైపు విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో మేకర్స్ వరుస అప్ డేట్స్ ఇస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సెట్టింగ్స్ వీడియో ని పంచుకున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సముద్రం ఒడ్డున వేసిన ఈ సెట్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది.


End of Article

You may also like