మీ భర్త ఎప్పుడు మీ పక్కనే ఉండాలని కోరుకుంటున్నారా..? అయితే ఈ 5 పనులు చేయండి..!

మీ భర్త ఎప్పుడు మీ పక్కనే ఉండాలని కోరుకుంటున్నారా..? అయితే ఈ 5 పనులు చేయండి..!

by Anudeep

Ads

భార్యాభర్తల బంధం ఎంత వైవిధ్యమైనదో మనందరికీ తెలిసిందే. రెండు వేరు వేరు కుటుంబాల్లో.. రెండు వేరు వేరు పరిస్థితుల్లో పెరిగిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి అనే బంధం తో ఒక్కటై ఒక్క చోట కలిసి ఉంటారు. అయితే.. పెళ్లి ఐన కొత్తల్లో ఉండే ప్రేమ.. ఆకర్షణ.. కాలం గడిచే కొద్దీ తగ్గుతూ.. బంధం పాతబడుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. నిజానికి అది ప్రేమ తగ్గడం కాదు.. మరింత బలపడడం. ఐతే., ఈ చిన్న చిన్న పనులను చేయడం వలన మీ బంధాన్ని పదిలం గా కాపాటుకోవచ్చు. మీ భర్తను ఎల్లప్పుడూ మీతోనే ఉండేలా చేసుకోవచ్చు.

Video Advertisement

భార్యాభర్తలన్నాక ఎన్నో గొడవలు వస్తుంటాయి పోతుంటాయి.. కానీ మనం వైవాహిక బంధానికి విలువను ఇచ్చి సర్దుకు పోతుంటాం. కలిసే ఉండడానికి ఇష్టపడటం. ఆ కలిసి ఉండేదేదో మరింత ఆనందం గా ఉండడానికి ఎందుకు ప్రయత్నించకూడదు..? కారణాలు ఏవైనా కావచ్చు.. మనస్పర్థలు భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతూ ఉంటాయి.. దూరం పెరిగినప్పుడల్లా మనం దూరాన్ని తగ్గించి దగ్గరవడానికి ప్రయత్నించాలి. మీ భర్త మీపై ప్రేమ చూపించడం లేదు అనిపిస్తోందా..? అయితే మీ వంతు ప్రయత్నం గా ఈ ఐదు పనులు చేసి చూడండి..

hug

1. భార్య భర్తలు పెళ్ళైన కొత్తల్లో ఎంతో చనువు గా ఉంటారు. ఆ చనువు ను మనం ఆ తరువాత కూడా కంటిన్యూ అయ్యేలా చూసుకోవాలి. మీరు హ్యాపీ గా ఉన్నా.. బాధ గా ఉన్నా మీ భర్తతో పంచుకునేటపుడు అతన్ని హగ్ చేసుకుని పంచుకోండి. హగ్ చేసుకోవడం పెళ్ళై కొన్నాళ్ళు పోయాక ఇబ్బంది గా ఉంది అని అనుకోకండి. హగ్ చేసుకోవడం వలన బంధాలు బలపడతాయి.. ఒకరిపట్ల ఒకరికి ప్రేమ పెరుగుతుంది. తెలియని అనుభూతి కలుగుతుంది.

eat

2. మీ భర్త తో పాటు కలిసి కాఫీ తాగడం, కలిసి తినడం వంటివి చేయండి. కలిసి ఆహరం తీసుకోవడం కూడా దగ్గరితనాన్ని పెంచుతుంది.

3. ఎప్పుడైనా కుదిరినప్పుడు, అవకాశం ఉన్నపుడు మీ భర్త తో కలిసి నడవడానికి ప్రయత్నించండి. సరదాగా మాట్లాడుకుంటూ నడవడం వలన ఆరోగ్యం తో పాటు మీ ఇద్దరి మధ్య ఉండే కలతలు కూడా తొలగుతాయి.

wife helping husband

4. మీ భర్త ఎప్పుడైనా ఆఫీస్ వర్క్ లో చిరాకు లో ఉన్నపుడు.. సమయం చూసుకుని మంచి కాఫీ ఇచ్చి ఏమైందో అనునయం గా, ప్రేమ గా కనుక్కోండి. మీ చిన్న చిరునవ్వు తో లేదా హగ్ తో అతని బాధని పోగొట్టండి.

5. చిన్న చిన్న స్పర్శల ద్వారా మీ భావాలను వ్యక్తీకరించండి. స్పర్శ చాలా గొప్పది. చిన్న స్పర్శయే అయినా మీ భర్త గుండెల్లో గంటలు కొట్టేయగలదు. ఆలస్యమెందుకు మరి.., ఇప్పుడే ప్రయత్నించి చూడండి.


End of Article

You may also like