“ధనత్రయోదశి” రోజు ఈ 7 వస్తువులు అస్సలు కొనకూడదు…కొంటే దరిద్రాన్ని కొనితెచ్చుకున్నట్టే.!

“ధనత్రయోదశి” రోజు ఈ 7 వస్తువులు అస్సలు కొనకూడదు…కొంటే దరిద్రాన్ని కొనితెచ్చుకున్నట్టే.!

by Mohana Priya

Ads

ఈ సంవత్సరం ధన్ తెరస్ నవంబర్ 13 వ తేదీన జరుపుకుంటున్నారు. ధన్ తెరస్ ని ధన త్రయోదశి అని కూడా అంటారు. నవంబర్ 13 వ తేదీన సాయంత్రం 5:30 నుంచి 6:00 గంటల సమయం వరకు ఆరాధన సమయం ఉంటుంది. ధన్ తెరస్ రోజు బంగారం కొనుగోలు చేయడం శుభసూచకంగా భావిస్తారు. అలాగే కుటుంబానికి కూడా ఐశ్వర్య ప్రాప్తి ఉంటుందని జ్యోతిష్కులు చెప్తున్నారు.

Video Advertisement

ధన్ తెరస్ రోజు కొనకూడనివి కూడా కొన్ని ఉన్నాయి. అలా కొనకూడనివి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

#1 ఉక్కు స్వచ్ఛమైన పదార్ధం కాదు. రాహువు యొక్క ప్రభావం ఉక్కుపై ఉంటుంది. అందుకే ఉక్కు వస్తువులను కొనకూడదు.  ధన త్రయోదశి రోజు సహజ లోహాలను మాత్రమే కొనుగోలు చేయాలి. ఆలా మనిషి నిర్మించిన లోహాల నుండి కేవలం ఇత్తడిని మాత్రమే కొనాలి.

#2 అలాగే అల్యూమినియంపై కూడా రాహువు ప్రభావం ఉంటుంది. ఇంకా అల్యూమినియంని దురదృష్టకానికి సూచికంగా పరిగణిస్తారు. అందుకనే అల్యూమినియం వస్తువులను కొనకూడదు.

#3 ఇనుముతో తయారుచేసిన వస్తువులు కొనుగోలు చేయకూడదు.

#4 కత్తెరలు, కత్తులు లాంటి పదునైన వస్తువులు కూడా కొనకూడదు.

#5 అంతే కాకుండా ప్లాస్టిక్ వస్తువులను, అలాగే సిరామిక్ తో తయారుచేసిన పువ్వులను లేదా ఇతర వస్తువులను కూడా కొనుగోలు చేయకూడదు.

#6 గాజు రాహువుకి సంబంధించినది అని అంటారు. అందుకే ధన త్రయోదశి రోజు గాజు వస్తువులను కూడా కొనుగోలు చేయకూడదు, అలాగే వాడకూడదు.

#7 నూనె లేదా నెయ్యి కొనేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అవి కల్తీవి అయ్యి ఉండొచ్చు. ధన త్రయోదశి రోజు అశుద్ధమైన పదార్థాలు కొనుగోలు చేయకూడదు. కాబట్టి ఆ రోజు నూనె లేదా నెయ్యి లాంటి పదార్థాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

 

 


End of Article

You may also like