మ‌నం నిత్యం వాడే ఈ 12 వ‌స్తువుల‌ను… ఒక‌ప్పుడు దేనికోసం ఉప‌యోగించేవారు తెలుసా..?

మ‌నం నిత్యం వాడే ఈ 12 వ‌స్తువుల‌ను… ఒక‌ప్పుడు దేనికోసం ఉప‌యోగించేవారు తెలుసా..?

by Mohana Priya

Ads

కొన్ని వస్తువులు ఒక పర్టిక్యులర్ విధానంలో ఉపయోగించుకోవడానికి కనిపెడతారు. కానీ వాటిని మాత్రం మనం తర్వాత వేరే విధంగా ఉపయోగించుకుంటున్నాం. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 బీర్ మ్యాట్

ఈ బీర్ మ్యాట్ 19వ శతాబ్దంలో బీర్ గ్లాస్ మీద పురుగులు లాంటివి పడకుండా కవర్ చేయడానికి కనిపెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం దాన్ని బీర్ గ్లాస్ కింద పెట్టి సర్వ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు.

things that are used for what they were meant for

#2 బ్లైండ్ రైటింగ్ రీడింగ్ సిస్టం

1808 లో చార్లెస్ బార్బీర్ నైట్ ఆల్ఫాబెట్స్ ని కనిపెట్టారు. ఇది రాత్రి పూట మిలిటరీ వారు కోడ్ మెసేజెస్ పంపడానికి, అలాగే చదవడానికి ఉపయోగించేవారు. తర్వాత చార్లెస్ బార్బీర్ తను కనిపెట్టిన ఈ నైట్ ఆల్ఫాబెట్స్ అనేది అంధులకి కూడా ఉపయోగపడుతుంది అని అనుకున్నారు.  బ్లైండ్ రైటింగ్ అండ్ రీడింగ్ మోడర్న్ సిస్టం కనిపెట్టిన లూయిస్ బ్రెయిలీ ఆ లిపిని నైట్ ఆల్ఫాబెట్స్ నుండి స్ఫూర్తి చెంది రూపొందించారు.

things that are used for what they were meant for

#3 టీ

ప్రస్తుతం చాలా మందికి టీ లేకపోతే రోజు గడవదు. అయితే అంతకు ముందు టీని వైద్యంలో గౌట్ కేసెస్ లో ఉపయోగించేవారు.

things that are used for what they were meant for

#4 M&M క్యాండీస్

వీటిని వరల్డ్ వార్ 2 సమయంలో మిలిటరీ వారి కోసం రూపొందించారు. ఒక ప్లేన్ చాక్లెట్ తీసుకొని ఎండ వేడిలో కరిగించేవారు. 1940 ఎండింగ్ సమయంలో ఇవి మార్కెట్ లోకి ఎంటర్ అయ్యాయి.

things that are used for what they were meant for

#5 గొడుగులు

అంతకుముందు యూరోప్, చైనా లలో సన్ రేస్ నుండి కాపాడుకోవడానికి గొడుగులని ఉపయోగించేవారు. 1770లో జోనాస్ హాన్వే అనే ఒక వ్యక్తి  ప్రస్తుతం మనం గొడుగులని ఎలా అయితే ఉపయోగిస్తున్నామో అలా ఉపయోగించడం మొదలుపెట్టారు. అంటే వర్షంలో మొదటిసారిగా గొడుగును ఉపయోగించారు.

things that are used for what they were meant for

#6 హుడ్స్

అంతకు ముందు వీటిని మొహం కవర్ చేసుకోవడానికి ఉపయోగించేవారు.

things that are used for what they were meant for

#7 విండోస్ గేమ్స్

విండోస్ ఆపరేటింగ్ సిస్టం లో ఉండే గేమ్స్, మౌస్ ఆపరేటింగ్ నేర్చుకోవడానికి క్రియేట్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది వీటిని టైంపాస్ కోసమే ఆడుతున్నాం.

things that are used for what they were meant for

#8 ఎరేజర్ లో ఉండే బ్లూ పార్ట్

ఇది పెన్ తో రాసినవి ఎరేజ్ చేయడానికి ఉపయోగిస్తారు అని మనకి తెలుసు. కానీ అంతకుముందు రెడ్ కలర్ తో ఎరేజ్ చేస్తే మరకలు పడితే వాటిని తొలగించేందుకు పెన్సిల్ డ్రాయింగ్స్ ని, రైటింగ్స్ ని బ్లూ కలర్ ఎరేజర్ తోనే ఎరేజ్ చేసేవారు.

things that are used for what they were meant for

#9 షర్ట్ లూప్

ఇది షర్ట్ వెనుక భాగంలో ఉంటుంది. దీనిని అంతకుముందు నేవి వారి కోసం తయారు చేశారు. వారికి వారి బట్టలు పెట్టుకోవడానికి ఎక్కువగా ప్లేస్ ఉండేది కాదు. అందుకే వారి యూనిఫామ్ ని ఉతికిన తర్వాత ఎక్కడైనా ఒక హుక్ కి తగిలించడానికి ఈ లూప్ ఏర్పాటు చేశారు. అంతే కాకుండా 1960 సమయంలో ఇదే లూప్ ని లాకర్ లూప్ పేరుతో GANT అనే బట్టల మానుఫ్యాక్చర్ చేసే సంస్థ ఏర్పాటు చేశారు. దీనిని వారి బట్టలు ఎక్కువగా వాడే ఐవీ లీగ్ కాలేజ్ స్టూడెంట్స్ వారి లాకర్స్ లో ముడతలు పడకుండా వారి షర్టు లని తగిలించడానికి ఉపయోగించేవారు

things that are used for what they were meant for

#10 జీన్స్ లో ఉండే ఫిఫ్త్ పాకెట్

ఇందులో ఇప్పుడు సాధారణంగా ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు పెట్టుకుంటున్నారు కానీ, 1873 లో లెవిస్ జీన్స్ సంస్థ ఈ పాకెట్ ని వాచ్ పెట్టుకోవడానికి రూపొందించింది. ఇప్పటికీ కూడా వారి కాటలాగ్స్ లో ఈ పాకెట్ ని వాచ్ పాకెట్ అని మెన్షన్ చేస్తారు.

things that are used for what they were meant for

#11 బలూన్ ఆనిమల్స్

అంతకుముందు జంతువుల పేగులతో బెలూన్లను తయారు చేసేవారు. వాటితో ఆడుకునే వాళ్ళు. చరిత్ర ప్రారంభం అయిన సమయంలో కొంత మంది బెలూన్లను తిప్పి కొత్త ఆకారాలు తయారు చేసే వాళ్ళు. అజెక్ట్ కి చెందిన వాళ్ళు అయితే పిల్లి పేగులతో బెలూన్ జంతువులను తయారు చేసే వాళ్ళు. వాటిని తమ దేవుడికి సమర్పించేవారు.

#12 కోగ్నాక్

అంతకు ముందు కోగ్నాక్ అంటే  డిస్టిల్డ్ వైన్ అంటే  స్వేదించిన మద్యాన్ని, నీటితో కలిపేవారు. ఇప్పుడు కోగ్నాక్ ని ఓక్ తో తయారుచేసిన బ్యారెల్స్ లో తయారు చేస్తున్నారు. ఇది నీరు కలపకుండా కూడా తాగవచ్చు.

image credits: brightside.me


End of Article

You may also like