Ads
కార్తీక మాసాన్ని ఎంతో పరమపవిత్రమైన మాసంగా భావిస్తారు.ఈ కార్తీకమాసం అంటే ఆ శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన నెల. ఈ నెలంతా దేవాలయాలలో మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ఈ నెల మొత్తం పూజలు, హోమాలు, వ్రతాలు, ఉపవాసాలు శుభకార్యాలకు ఎంతో ప్రసిద్ధి చెందినది.
Video Advertisement
ఈ నెలలో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమిని ‘‘కార్తీక పౌర్ణమి’’అంటారు. ఈ ఏడాది నవంబర్ 7 , 8వ తేదీల్లో వచ్చింది. ఈ పవిత్రమైన పర్వదినాన మరికొన్ని ప్రత్యేకమైన పనులు తప్పకుండా చేయాలి.. ఇలా చేయడం వల్ల పరమేశ్వరుడి, శ్రీ హరి అనుగ్రహం తప్పక లభిస్తుంది… ఈ సందర్భంగా కార్తీక పౌర్ణమి వేళ కచ్చితంగా చేయాల్సిన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
కార్తీక పౌర్ణమి దీప దానం, ఇతర దానాలు చేయడానికి ఎంతో పవిత్రమైనది. ఈ పవిత్రమైన రోజున సత్యనారాయణ వ్రతం చేసినా లేదా ఈ వ్రతం కథను విన్న వారికి సకల శుభాలు కలుగుతాయి. ఇదే రోజున సాయంకాలం వేళ సంధ్యా సమయంలో ఏదైనా శివాలయంలో లేదా రావిచెట్టు దగ్గర లేదా తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగించాలి.
కార్తీక పౌర్ణమి రోజు ఉదయం స్నానమాచరించి పెద్ద ఎత్తున భక్తులు దేవాలయాలను సందర్శించి దీపాలను వెలిగిస్తూ ఉంటారు.అయితే కార్తీక పౌర్ణమి రోజు రోజంతా ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో 365 వత్తులను వెలిగించడం ద్వారా ఎంతో పుణ్య ఫలం దక్కుతుంది. సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి కాబట్టి, కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులను ఆవు నెయ్యి వేసి వెలిగించడం ద్వారా సంవత్సరం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యఫలం దక్కుతుంది.
కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం మాత్రమే కాదు.. దీప దానం, ఇతర దానాలు చేయడానికి ఎంతో పవిత్రమైనది. పురాణాల ప్రకారం, ఈ రోజున క్షీర సాగర దానానికి అనంతమైన ప్రాముఖ్యత ఉంది. కార్తీక పౌర్ణమి రోజునే గౌరీ నోములు నోచుకుంటారు.
ఈ పవిత్రమైన పర్వదినాన తులసి చెట్టు పక్కనే ఉసిరికాయలను ఉంచి దాని పక్కన రాధాక్రిష్ణుల విగ్రహాన్ని పెట్టి వివాహం కానీ వారు పూజలు చేస్తే కోరుకున్న వారు భాగస్వామిగా లభిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయలను దానం చేస్తే దారిద్య్రం తొలగిపోతుంది. అలాగే లలితా సహస్రనామాలను చేస్తే సిరి సంపదలు కలుగుతాయి. విష్ణు సహస్రనామ పారాయణం, లలిత పారాయణం, లక్ష్మీ అష్టోత్తరం, శివ పంచాక్షరీ స్తోత్రం, శివ సహస్రనామం, శివ పురాణాల పారాయణం చేయడం మంచిది.
End of Article