ఇదేందయ్యా.. “ఊ అంటావా.. ఉహూ అంటావా..” పాట నుంచి ఇన్ని విషయాలు నేర్చుకోవచ్చా..? వైరల్ అవుతున్న పోస్ట్..!

ఇదేందయ్యా.. “ఊ అంటావా.. ఉహూ అంటావా..” పాట నుంచి ఇన్ని విషయాలు నేర్చుకోవచ్చా..? వైరల్ అవుతున్న పోస్ట్..!

by Anudeep

Ads

పుష్ప మూవీ థియేటర్ లో విడుదల అయ్యి హిట్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ సినిమా ఓటిటిలో కూడా విడుదల అయ్యింది. ఓటిటిలో విడుదల అయ్యిన తరువాత కూడా పుష్ప హవా కొనసాగుతూనే ఉంది. ఇంకా.. పుష్ప గురించి సోషల్ మీడియాలో కధనాలు వస్తూనే ఉన్నాయి.

Video Advertisement

ఈ సినిమాకు “ఊ అంటావా.. ఉహూ అంటావా మావా..” అనే పాట చాలా హైప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాటలో సమంత నర్తించడంతో మరింత పాపులారిటీ వచ్చింది.

oo antava

ఈ పాట కోసమే ఈ సినిమాను థియేటర్లో చూడాలి అని ఫాన్స్ ఫిక్స్ కూడా అయిపోయారు. అల్లు అర్జున్ తో సహా నటుల లుక్స్ డిఫరెంట్ గా ఉండడం, ప్రత్యేక గీతంలో సమంత నర్తించడంతో ఈ సినిమాపై ఫాన్స్ బాగానే ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ “ఊ అంటావా.. ఊహు అంటావా..” సాంగ్ ని చాలా సార్లు చూసేసి ఉంటారు కదా. అయితే ఈ సాంగ్ నుంచి ఈ ఐదు విషయాలు నేర్చుకున్నా అంటూ ఇంస్టాగ్రామ్ “కామెడీ కావాలా బాబు..” పేజీ వారు ఓ పోస్ట్ ను పెట్టారు. ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అయిపోతోంది. ఇది చూస్తే నవ్వు రాక మానదు.  ఇంతకీ ఆ ఐదు విషయాలేంటో చూడండి.

#1. యోగా:

samantha 1
ఈ డాన్స్ లో సమంత ప్రతి స్టెప్ ను ఎంతో డెడికేటెడ్ గా చేసింది. యోగా ద్వారా ఆమెకు తన బాడీ పై వచ్చిన పట్టు వల్లే ఇది సాధ్యమైంది. అందుకే.. మన జీవితంలో కూడా యోగ ని భాగస్వామ్యం చేసుకోవాలి. తద్వారా మన శరీరం తేలికపడి మనం ఏ పనిని అయినా స్వతంత్రంగా చేయగలుగుతాం.

#2. ప్రేమ:

samantha 2
ఈ పాటలో సమంత అందరిని ఒకేలా ట్రీట్ చేస్తుంది. తనకు నచ్చకపోయినా ఎవరిపైనా ద్వేషాన్ని చూపించదు. అందుకే.. ప్రేమని పంచాలి ద్వేషాన్ని కాదు అన్న వాక్యాలని గుర్తు పెట్టుకోవాలి.

#3. నెగటివ్ పీపుల్:

samantha 3
ఈ పాటలో ఓ చోట సమంత మొగిలేశును చూసి కూడా పక్కకు వెళ్ళిపోతుంది. ఈ సినిమాలో మొగిలేశు నెగటివ్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అందుకే జీవితంలో కూడా నెగటివ్ వ్యక్తులకి దూరంగా ఉండాలని ఈ పాట చెప్పకనే చెబుతోంది.

#4 క్విట్ స్మోకింగ్:

samantha 4
ఈ పాటలో అల్లు అర్జున్ సిగరెట్ వెలిగించుకుంటే.. సమంత పక్కనుంచి వచ్చి ఆ సిగరెట్ ని ఆర్పేస్తుంది. సిగరెట్ ఆరోగ్యానికి హానికరం. అందుకే స్మోకింగ్ వద్దు అని చెప్పకనే చెబుతోంది.

#5. వాటర్:

samantha 5
ఇక లాస్ట్ విషయం ఏంటంటే.. ఎల్లప్పుడూ వాటర్ తాగుతూ ఉండండి. మీ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోండి.

ఇవన్నీ చూసాక నవ్వొస్తోంది కదా.. ఏదైనా ఈ రేంజ్ లో క్రియేటివిటీ ఉండడం అంటే గొప్ప విషయమే.

https://www.instagram.com/p/CYg3lqEJtBZ/?fbclid=IwAR38ce5zhmE0_CU0IfRkPpZYA97zOdd7MnCFNgQ6XhEP_FvlPtR4CPjpCJo

 


End of Article

You may also like