ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సినీ ప్రముఖుల చిన్ననాటి ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా స్టార్ హీరోల చిన్నప్పటి ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Video Advertisement

రీసెంట్ గా చిరంజీవి, పవన్ కళ్యాణ్ చైల్డ్ హుడ్ ఫోటోలు నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఇద్దరు  స్టార్ హీరోలు ఉన్న చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
పైన ఉన్న ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు అబ్బాయిలు అన్నదమ్ముళ్లు. వారిద్దరూ ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. వారి కెరీర్ లో అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ సినిమాలలో నటించారు. అది మాత్రమే కాకుండా  వైవిధ్యమైన చిత్రాలతో ఆడియెన్స్ మనసులలో స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. వాస్తవానికి వీరిద్దరు కోలీవుడ్ హీరోలు. అయినప్పటికీ తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్నారు. ఈ హీరోలు మరెవరో కాదు. కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య మరియు కార్తీ.
డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగువారికి చేరువైన ఈ సోదరులు నటించిన సినిమాలు తెలుగులో విడుదల అయ్యి, మంచి కలెక్షన్స్ రాబడతాయి. డబ్బింగ్ సినిమాల ద్వారా కూడా తెలుగులో హిట్ అందుకున్నారు. తమిళ హీరోలు అయినప్పటికీ టాలీవుడ్ లో వీరికి మంచి క్రేజ్ ఉంది. ఇద్దరు విలక్షణమైన నటన, విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.

సూర్య జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ ను అందుకున్నారు. గజిని, సింహం సినిమాలతో  తెలుగు ఆడియెన్స్ కు దగ్గరయ్యారు. కార్తీ 2010లో ‘యుగానికి ఒక్కడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు  పరిచయం అయ్యాడు. ఆ తర్వాత శకుని,  దొంగ, చెలియా, ఊపిరి, ఖైదీ, సర్దార్ వంటి సినిమాలలో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఈ సోదరులిద్దరు తమ సినిమాల షూటింగ్స్ లో బిజీ బిజీగా ఉన్నారు.

Also Read: అసలు హీరో ఎందుకు ఇవ్వాలి..? మరి అర్జున్ రెడ్డి లాభాలు తిరిగి ఇస్తారా..?