ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల కొన్ని కుటుంబాలకి కోటి రూపాయల సహాయం చేస్తాను అని ప్రకటించారు.

Video Advertisement

ఈ నేపథ్యంలో వరల్డ్ ఫేమస్ లవర్ నిర్మాతలు అయిన అభిషేక్ పిక్చర్స్ వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఆ సినిమాకి 8 కోట్ల నష్టం వచ్చింది అని, ఇప్పుడు ఎలాగో విజయ్ దేవరకొండ ఇంత మందికి సహాయం చేస్తున్నారు కాబట్టి, సినిమా నష్టానికి కూడా డబ్బులు ఇచ్చి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల కుటుంబాలని కాపాడమని ట్వీట్ చేశారు.

ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ట్రెండ్స్ స్పందించి ఈ విషయంపై ఈ విధంగా ట్వీట్ చేశారు. ఈ విషయంపై వాళ్ళు మాట్లాడుతూ, ” డియర్ అభిషేక్ పిక్చర్స్, వరల్డ్ ఫేమస్ లవర్ బిజినెస్ అగ్రిమెంట్ NRA బేసిస్ మీద జరిగింది. ఈ సినిమా లాభాలకి, నష్టాలకి సంబంధం లేని హీరో మీరు చెప్పిన నష్టాన్ని ఎందుకు భరించి మీకు డబ్బులు ఇవ్వాలి? వెస్ట్ గోదావరి జిల్లాలో అర్జున్ రెడ్డి సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసి భారీ లాభాలు సంపాదించారు.”

vijay devarakonda trends reply to abhishek pictures

“మరి ఇప్పుడు అర్జున్ రెడ్డి వెస్ట్ గోదావరి ప్రాఫిట్స్ తిరిగి ఇస్తారా? మీ ఉద్దేశం విజయ దేవరకొండ ని టార్గెట్ చేయడం అయితే ప్రొడ్యూసర్లని అడగండి” అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ చర్చ జరుగుతోంది. విజయ్ దేవరకొండకి మద్దతుగా చాలా మంది మాట్లాడుతున్నారు.

ALSO READ : నటి మృతి అంటూ వార్త..! విషయం ఏంటంటే..?