Ads
సాధారణంగా కోడి గుడ్డు ఒకటి ధర 5 రూపాయలు ఉంటుంది కానీ మద్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ కోడి గుడ్డు 50 రూపాయలు ,అప్పుడే పుట్టిన ఈ కోడి పిల్ల ఖరీదు 150 రూపాయలు. ఈ కోడి ఇండియాలోనే అత్యంత డిమాండ్ ఉన్న కోడి.ఈ కోడి గుడ్డు ఒకటి ₹ 50/-, కిలో మాంసం ₹ 900/-.అవును మీరు వింటున్నది నిజమే ..ఒక కోడికి ఇంత రేటు ఎందుకు అనే డౌట్ మీకు రావొచ్చు.ఇందులో అంత స్పెషల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Video Advertisement
మద్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ కోడి జాతి పేరు కడక్‌నాథ్ …అనేక రోగాలను తగ్గించే శక్తి ఈ కోడి మాంసంలో ఉండడం విశేషం. .ఈ కోడి పేరు,రూపం దగ్గర్నుంచి అన్నీ ప్రత్యేకతలే…అంతేకాదు దీని మాంసం ఎన్నో పోషక విలువలు కలిగి ఉండటంతో పాటు అరుదైన ఔషధ లక్షణాలు సైతం కలిగి ఉంటుంది.కడక్ నాథ్ కోళ్ళను మధ్యప్రదేశ్ లో కాలి-మాసి( నల్లదైన మాంసం కలది) అని పిలుచుకుంటారు.ఇప్పుడు నాటుకోడి కూర కన్నా కడక్‌నాథ్ కోడికి డిమాండ్ ఎక్కువగా ఉంది. కడక్‌నాథ్ కోడి..నల్లగా ఉంటుంది. చికెన్ కలర్ కూడా నల్లగానే ఉంటుంది. కూర వండినా.. ముక్కలు నల్లగానే ఉంటాయి
కడక్‌నాథ్ కోడి ప్రత్యేకతలు
కడక్‌నాథ్ కోడి ముదురు నలుపు, ముదురు నీలం రంగుల్లో ఉండే కడక్నాథ్ కోళ్లలో వెంట్రుకలు, చర్మం, మాంసంతో పాటు రక్తం కూడా నల్లగానే ఉంటుంది. వేసవిలో సుమారు 100 గుడ్లు పెడుతుంది. 7 నెలల వ్యవధిలో ఈ కోడి కేవలం 1.5 కేజీల బరువు మాత్రమే పెరుగుతుంది.ఈ కోడి పెట్టే గుడ్డు, మాంసం కూడా పూర్తిగా బ్లాక్ కలర్ లోనే ఉండడం విశేషం.దీని మాంసం తినడం వల్లల జీర్ణ శక్తి, రోగ నిరోధక శక్తులు పెరుగుతాయి. కడక్‌నాథ్ జాతి కోళ్ల మాంసంలో కొవ్వు చాలా తక్కువగా,మాంసకృత్తులు ఎక్కువగా లభిస్తాయి ఈ కోడి మాంసం లో ఔషద గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల దీనిని మెడిసిన్స్ లో మెడిసిన్స్ లో వినియోగించబడుతుంది.ఔషద గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల క్రీడాకారులకు ఇచ్చే ఫుడ్ లో దీనిని చేర్చలనే డిమాండ్ కూడా ఉంది.
End of Article