లేడీ సూపర్ స్టార్ నయనతారకు సౌత్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ మరియు ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీలలో అనేక బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించింది.

Video Advertisement

జవాన్ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. స్టార్ హీరోలకు పోటీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న నయనతార గతంలో నటించిన ఒక యాడ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
దక్షిణాది హీరోయిన్లలో నయనతార లేడి సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. వ్యక్తిగత విషయంలోనూ, సినిమాల విషయంలోనూ ఆమె ఎప్పుడూ తనదైన శైలిలో ముందుకు వెళ్తుంది. ఆమెకు సంబంధించిన విషయం ఏదైనా క్షణాల్లో వైరల్ గా మారుతుంది. అత్యధిక రెన్యుమరేషన్ అందుకుంటున్న హీరోయిన్ గా రికార్డు సృష్టించారు. గత ఏడాది దర్శకుడు విగ్నేష్ శివన్ పెళ్లి చేసుకుని వైవాహిక జీవితం ప్రారంభించిన విషయం తెలిసిందే. సరోగసి ద్వారా కవలలకు తల్లిదండ్రులు అయ్యారు.
ప్రస్తుతం నయనతార బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న జవాన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. ఇది ఇలా ఉంటే నయనతార గతంలో నటించిన ఒక ప్రకటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ యాడ్ లో ఆమె గుర్తుపట్టలేనట్టుగా ఉంది. ఆమె కాలేజీలో చదువుతున్న సమయంలో మోడల్‌గా పార్ట్ టైమ్ జాబ్ చేసింది. అలా నయనతార నటించిన ప్రకటనలలో కొన్నింటిని చూసిన దర్శకుడు సత్యన్ అంతిక్కడ్ తాను తీయబోయే మనస్సినక్కరే సినిమాలో కీలక పాత్రకోసం ఆమెను సంప్రదించాడు.
మొదట్లో నయనతార ఆఫర్‌ను రిజెక్ట్ చేసినప్పటికీ, ఆ తరువాత దర్శకుడు వదలకుండా ప్రయత్నించడంతో చివరికి ఆమె అంగీకరించింది. అలా నయనతార 2003లో మలయాళ సినిమా ‘మనస్సినక్కరే’ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ మూవీ హిట్ అవడం, వరుస అవకాశాలు రావడంతో సినిమాలలో నటిస్తూ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఆమె కాలేజీ రోజుల్లో నటించిన యాడ్ ప్రస్తుతం నెట్టింట్లో షికారు చేస్తోంది.

Also Read: “రూల్స్‌ రంజన్‌” మూవీలోని “సమ్మోహనుడా..” సాంగ్‌ ఆ సినిమా నుండి కాపీ చేశారా..?