52 ఏళ్ళ “పవన్ కళ్యాణ్” కి తల్లిగా 55 ఏళ్ళ హీరోయిన్..! ఇదెక్కడి వింత..?

52 ఏళ్ళ “పవన్ కళ్యాణ్” కి తల్లిగా 55 ఏళ్ళ హీరోయిన్..! ఇదెక్కడి వింత..?

by kavitha

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినిమాలలో నటిస్తూనే, ఇటు జనసేన అధినేతగా రాజకీయాలలోను క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. రీసెంట్ గా బ్రో మూవీతో ఆడియెన్స్ ను పలకరించారు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో ఓజీ, హరిహర వీరమల్లు, హరిశంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటిస్తున్నారు.

Video Advertisement

ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ నుండి పవన్ కళ్యాణ్ పోలీస్ యూనిఫామ్ లో ఉన్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. తాజాగా ఈ మూవీ గురించిన అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తీసిన దర్శకుడు హరీష్ శంకర్ చాలా కాలం తరువాత  పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గత 3 నెలలుగా పోస్ట్ పోన్ అయ్యింది. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉండడంతో  ఆయనకు టైమ్ దొరికినప్పుడు మాత్రమే షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ఇటీవల జరిగిన షెడ్యూల్లో కీలక యాక్షన్ సీన్స్ ను షూట్ చేసినట్లుగా మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీ కోలీవుడ్ మూవీ తేరికి రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి సంబంధించిన అప్డేట్ నెట్టింట్లో షికారు చేస్తోంది. ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ గౌతమి ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారట. గౌతమి పవన్ కళ్యాణ్ కి మదర్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్, గౌతమి పైన డైరెక్టర్ హరీష్ శంకర్ కీలకమైన సీన్స్  చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
గౌతమి ఒకప్పుడు స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించారు. తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలోనూ హీరోయిన్ గా కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో నటించి, స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు.  ప్రస్తుతం పలు సినిమాలలో తల్లి క్యారెక్టర్లలో నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన శాకుంతలం, అన్ని మంచి శకునములే లాంటి  చిత్రాలలో గౌతమి నటించారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ కి గౌతమి తల్లిగా నటిస్తున్నారనే వార్తలు రావడంతో 52 ఏళ్ల హీరోకు తల్లిగా, 55 ఏళ్ల హీరోయినా అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: “పవన్ కళ్యాణ్” చేతులకి పెట్టుకున్న ఈ ఉంగరాలు ఏంటో తెలుసా..? వీటి వల్ల ఎలాంటి యోగం కలుగుతుంది అంటే..?


End of Article

You may also like