ఈ పిల్లాడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీనే ఏలేసే అంత పెద్ద హీరో అయ్యాడు..! ఎవరో తెలుసా..?

ఈ పిల్లాడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీనే ఏలేసే అంత పెద్ద హీరో అయ్యాడు..! ఎవరో తెలుసా..?

by kavitha

Ads

ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి, ఇప్పుడు స్టార్ హీరో. ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ, సూపర్ స్టార్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు ఆయనదే. కొత్త హీరోలు ఎంతమంది వచ్చిన ఆయన క్రేజ్ ను దాటడం ఎవరికి సాధ్యం కాదు. ఇప్పటికి ఎన్నో రికార్డ్స్ ఆ హీరో పేరు మీదే ఉన్నాయని చెప్పవచ్చు.

Video Advertisement

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ను సంపాదించుకున్న తొలి సౌత్ హీరోగా కూడా రికార్డ్ ఆయన పేరు మీదనే ఉంది. ఆయన నటించిన చిత్రాలు విదేశాల్లో కూడా ఆకట్టుకుంటాయి. అన్నిటి కన్నా ఎక్కువగా జపాన్ లో విపరీతంగా అభిమానిస్తారు. ఆయనెవరో కాదు సూపర్ స్టార్ రజినికాంత్. ఆయన చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
రజనీకాంత్ 1950లో డిసెంబరు 12న మైసూరురాష్ట్రంలోని బెంగళూరులో మరాఠీ ఫ్యామిలిలో జన్మించాడు. రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఆయన తల్లి గృహిణి, తండ్రి పేరు రామోజీరావు గైక్వాడ్.  పోలీస్ కానిస్టేబుల్ గా పని చేసేవారు. వీరి ఫ్యామిలీ మహారాష్ట్ర నుంచి బెంగళూరుకు వచ్చి, స్థిరపడ్డారు. నలుగురు పిల్లల్లో రజినీకాంత్ చిన్నవాడు. రజినీకాంత్ 9 ఏళ్లు ఉన్నప్పుడు తల్లిని కోల్పోయాడు.
రజినీకాంత్ గవర్నమెంట్ కన్నడ ప్రైమరీ స్కూల్ లో చదువుకున్నాడు. ఆ తరువాత రజినీకాంత్ ను రామకృష్ణ మఠంలో చేర్చారు. అక్కడ ఆధ్యాత్మిక పాఠాలతో పాటుగా నాటకాలలో పాల్గొనేవాడు. మఠంలో ఒకసారి జరిగిన  పౌరాణిక నాటకంలో రజినీకాంత్ ఏకలవ్యుడి స్నేహితుడి పాత్రలో నటించారు. రజిని నటనకు ప్రముఖ కన్నడ కవి డిఆర్.బెంద్రే ప్రశంసించారు. అప్పటి నుండి ఆయనకు నటన పట్ల ఆసక్తి పెరుగుతూ వచ్చింది. చదువు పూర్తి అయిన తరువాత రజనీకాంత్ కూలీపనితో సహా ఎన్నో పనులు చేశాడు.
ఆ తర్వాత బెంగుళూరు ట్రాన్స్‌పోర్ట్ లో బస్ కండక్టర్‌గా జాబ్ వచ్చింది. ఆ ఉద్యోగం చేస్తున్న కొత్తగా ఏర్పాటు చేసిన మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ ప్రకటన కనిపించింది. దానిలో చేరి నటనలో శిక్షణ తీసుకోవాలనుకున్నాడు. అతని ఫ్రెండ్, సహోద్యోగీ రాజ్ బహదూర్ ఇన్‌స్టిట్యూట్‌ లో చేరేలా ప్రోత్సహించడమే కాకుండా, ఆర్థికంగా కూడా సహాయం చేశాడు. అక్కడే తమిళ దర్శకుడు కె.బాలచందర్ రజినికాంత్ ను గుర్తించాడు. అయితే కోలీవుడ్ లో శివాజీ గణేశన్‌ స్టార్ హీరోగా ఉన్నారు. ఇద్దరి పేర్లు ఒకేలా ఉండడంతో బాలచందర్ శివాజీ పేరును రజినీకాంత్‌ గా మార్చారు.
అలాగే తమిళంలో మాట్లాడటం కూడా నేర్చుకోమని సలహా ఇచ్చాడు. రజనీకాంత్ ఆ సలహాను పాటించి తమిళం నేర్చుకున్నారు. 1975 లో బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అపూర్వ రాగంగళ్;సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసిన రజినికాంత్, 1977 లో తెలుగులో తొలిసారిగా ‘చిలకమ్మ చెప్పింది’ అనే సినిమాలో హీరోగా నటించారు. ఆ తరువాత పలు తెలుగు సినిమాలలో నటించిన రజినికాంత్ సౌత్  సూపర్ స్టార్ గా ఎదిగారు. ప్రస్తుతం జైలర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

Also Read: వాళ్ల సంగతి సరే..! మరి వీళ్ళు ఏం చేస్తున్నారు..?

 


End of Article

You may also like