• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

తన భార్య శవంతోనే 21 ఏళ్ళు సహజీవనం చేసాడు ఈ 72 ఏళ్ల వ్యక్తి.. చివరికి ఏమైందంటే?

Published on July 13, 2022 by Lakshmi Bharathi

భార్యాభర్తల బంధం ఎంతో ప్రత్యేకమైనది. ఎన్నో సర్దుబాట్లతో, ప్రేమాభిమానాలతో కొనసాగే ఈ బంధం ఒక్కసారిగా తెగిపోతే ఆ బాధ వర్ణించలేనిది. ఆ ఎడబాటుకి కారణం మరణం అయితే అంతకంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు. ప్రస్తుతం పలు చోట్ల భార్యలను హింసకు గురి చేసే వారే ఎక్కువ ఉన్నప్పటికీ.. తమ భార్యలని కంటికి రెప్పలా కాపాడుకునే వారు కూడా ఉన్నారు.

అయితే.. ఈ వ్యక్తి మాత్రం చనిపోయిన తన భార్య శవంతో ఏకంగా 21 ఏళ్ళు సహవాసం చేసారు. ఆమెను మర్చిపోలేకే ఆమె శవంతోనే కాలం గడిపాడు. చివరకు ఈ ఏడాది ఏప్రిల్ 30 వ తేదీన ఆమెకు తుది వీడ్కోలు తెలిపాడు.

final rituals 1

సీత వియోగంలో ఉన్న శ్రీరాముడు కూడా తన భార్యని మర్చిపోలేక సీత దేవి బంగారు విగ్రహాన్ని తయారు చేయించి ఆ విగ్రహాన్ని తన భార్యగా భావిస్తూ అశ్వమేధ యాగాన్ని పూర్తి చేస్తాడు. భార్య చనిపోతే.. భార్య లాంటి మైనపు విగ్రహాలను చెక్కించి ఇంట్లో పెట్టుకునే వారు కూడా ఉన్నారు. కానీ, ఈ వ్యక్తి మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లోని బ్యాంగ్ ఖేన్ జిల్లాకు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ చార్న్ జన్వా చకల్ భార్య రెండు దశాబ్దాల క్రితమే అనారోగ్యంతో మరణించింది.

final rituals 2

దీనితో కుంగిపోయిన చార్న్ తన భార్యని మరచిపోలేక ఆమె శవాన్ని ఒక శవపేటికలో ఉంచి ఇంట్లోనే ఓ పక్కన ఉంచి భద్రంగా ఉంచుకున్నాడు. ప్రస్తుతం చార్న్ వయసు 72 సంవత్సరాలు. ఇక భార్య శవాన్ని భద్రపరచడం కష్టం అని భావించిన చార్న్ ఇటీవలే ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించాడు. ఆమె చితాభస్మాన్ని కలశంలో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఈ దహన సంస్కారాల తాలూకు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి.


We are hiring Content Writers. Click Here to Apply



Search

Recent Posts

  • ఈ రెండు ఫోటోల మధ్య రెండు తేడాలు ఉన్నాయి…అవి ఏంటో కనిపెట్టగలరా.?
  • జనరిక్ మెడిసిన్స్ అంటే ఏంటి.? అవి ఎందుకు తక్కువ ధరకే అమ్ముతారు…?
  • “బింబిసార” సినిమాకి… ఈ 2 విషయాలే మైనస్ అయ్యాయా..?
  • ఆ ఎన్టీఆర్ సినిమాకి…హలో బ్రదర్ సినిమాకి మధ్య ఉన్న లింక్ ఏంటో మీకు తెలుసా.?
  • చిరు కూతురుతో ఉదయ్ కిరణ్ పెళ్లి ఆగిపోవడానికి అసలు రీజన్ అదేనట వైరల్ గా మారిన అతని కామెంట్స్

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions