సామాన్యం గా పాములంటేనే విష జంతువులు. పాముల్లోనే రకరకాలు ఉన్నాయి. వాటిల్లో విషనాగులు అత్యంత ప్రమాదకరమైనవి. వీటి కోరల్లో ఉండే విషం ఎంతటివారినైనా క్షణాల్లో చంపేస్తుంది. ప్రపంచం లో ఉండే అన్ని సర్పాల్లోనూ విషనాగులు ఎక్కువ విషపూరితమైనవి. ఈ పాము ఫోటో ఒకటి ఇటీవల సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఆ సంగతేంటో మీరు కూడా చూసేయండి.

australia poisinous snake

ఈ ఫోటో ని చూస్తే మీకు ఏమి కనిపిస్తోంది. ఓ ఇంట్లో సోఫా సెట్, పైపు, ఇతర వస్తువులు తప్ప ఏమి కనిపించడం లేదా..? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఈ ఫోటోని నిశితం గా గమనిస్తే ఓ విషనాగు తల మీకు కనిపిస్తుంది. ప్రపంచంలోకెల్లా రెండవ అత్యంత విషపూరితమైన పాము విషనాగు ఆ ఫోటో లో ఉంది. ఈ కింద ఫోటో చూడండి. సర్కిల్ వద్ద గమనించండి. రాళ్ల మధ్య విషనాగు తల కనిపిస్తుంది. ఈ ఫోటో ను స్నేక్ క్యాచర్ సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా, ఈ ఫోటో వైరల్ అవుతోంది.

australia poisinous snake 2

ఈ ఫోటో ఆస్ట్రేలియా లో తీసినది. అక్కడ ఓ ఇంట్లో కి పాము చొరబడడం తో ఆ ఇంటి సభ్యులు స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. అతను దీనిని విషనాగు గా గుర్తించి దానిని అక్కడ నుంచి పట్టాడు. అయితే, ముందు ఈ ఫోటో ను తీసాడు. ఆ తరువాత సోషల్ మీడియా లో ఈ ఫోటో లో ఎక్కడ విషనాగు ఉందొ చెప్పాలంటూ ఈ ఫోటో ను షేర్ చేసాడు. సోఫా వెనుక, రాళ్ల మధ్య లో బ్రౌన్ కలర్ లో ఈ పాము ఇరుక్కుని ఉంది. సహజం గా, ఈ పాములు రాళ్ల మధ్యే ఇరుక్కుంటూ ఉంటాయి. ఎక్కువ గా ఆస్ట్రేలియా లోనే సంచరిస్తాయట. ఈ పాములు ఒక్కసారి గాని కరిచాయంటే.. అంతే ఆ వ్యక్తి మరణిస్తాడు. ఇవి ఎక్కువ గా రాళ్ల మధ్య లోనే ఉండి చిన్న చిన్న పురుగులను ఆహరం గా తింటాయట.

australia poisinous snake 3