ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గత కొద్ది రోజులుగా ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ). దీనివల్ల ఉపాధి అవకాశాలు తగ్గుతాయని,  మానవాళికి ముప్పుగా మారుతుందని పలువురు నిపుణులు ఇప్పటికే వెల్లడించారు. ఇదంతా ఒకవైపు.

Video Advertisement

మరో వైపు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో అద్భుతాలు క్రియేట్ చేయగలమని అంటున్నారు. ఏఐ టూల్స్ ను  ఉపయోగించి, చాలా మంది ఇప్పటికే అద్భుతమైన ఫోటోలను క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఏఐ ఎడిట్ ట్రెండ్ కొనసాగుతోంది. తాజాగా ఒక స్టార్ హీరో ఫోటోను ఏఐ టూల్ తో క్రియేట్ చేశారు. ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఇటీవల కాలంలో ఏఐ టూల్స్ ను ఉపయోగించి, దేవుళ్ళ ఫోటోలను, సినీ సెలబ్రిటీల ఫొటోలను ఎడిట్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అవి క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి. నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్ శ్రీనివాస్ మోహన్ ఆకాశం, సముద్రం, పడవలతో కూడిన ఫోటోని టాలీవుడ్ స్టార్ హీరో ముఖంలా రూపొందించారు. ఆ హీరో మరెవరో కాదు, యంగ్ టైగర్ ఎన్టీఆర్.
ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘దేవర’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం కోస్తా ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతోంది. తాజాగా శ్రీనివాస్ మోహన్ రెండు ఫోటోలను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.
ఆ పోస్ట్ కు ప్లేయింగ్ విత్ ఏఐ ఇల్యూజన్ టూల్ అని పెట్టాడు. సముద్ర తీరాన ఉన్న పడవలతో ఎన్టీఆర్ ఫేస్ ను డిజైన్ చేశాడు. క్షణాల్లోనే ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మాస్, టెర్రిఫిక్ వంటి పదాలు సరిపోవేమో దేవర అని కామెంట్స్ చేస్తున్నారు. ‘ఫోటోలే ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే మూవీ ఏ రేంజ్ లో  ఉంటుంది?’ అని నెట్టింట్లో అభిమానులు చర్చించుకుంటున్నారు.

Also Read: “అసలైన కల్ట్ క్లాసిక్ సినిమా అంటే ఇదే..!” అంటూ… రవికృష్ణ “7/G బృందావన్ కాలనీ” రీ-రిలీజ్‌పై 15 మీమ్స్..!