Ads
ఒక భాషలో ఏదైనా ఒక సినిమా హిట్ అయితే ఇంకొక భాషలో రీమేక్ చేయడం అనేది చాలా సహజమైన విషయం. అలా చాలా తెలుగు సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి. కొన్ని సినిమాలు చాలా ఎక్కువ భాషల్లో రీమేక్ అయ్యాయి. కొన్ని సినిమాలు మాత్రం ఇతర ఇండస్ట్రీలలోకి రీమేక్ అయ్యి ఆ హీరోల కెరీర్ లో కూడా గుర్తుండిపోయే సినిమాలు అయ్యాయి. అందులో మహేష్ బాబు హీరోగా నటించిన ఒక్కడు సినిమా ఒకటి. తెలుగులో ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని తమిళ్ లో విజయ్ గిల్లి పేరుతో రీమేక్ చేశారు. గత కొంత కాలం నుండి సోషల్ మీడియాలో ఒక్కడు వర్సెస్ గిల్లి అనే డిబేట్ నడుస్తోంది.
Video Advertisement
తెలుగు వాళ్ళు మా సినిమా బాగుంది అంటే, తమిళ వాళ్లు వాళ్ల సినిమా బాగుంది అని అంటున్నారు. కానీ సరిగ్గా చూస్తే, తమిళ్ రీమేక్ సినిమాలో చాలా ఓవర్ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. సినిమాటిక్ లిబర్టీ పేరుతో వాళ్ళు చేసిన కొన్ని మార్పులు కామెడీగా అనిపిస్తాయి. అందులో క్లైమాక్స్ ఫైట్ కూడా ఒకటి. ఇది తెలుగులో చాలా సాధారణంగా ఉంటుంది. ప్రకాష్ రాజ్, మహేష్ బాబు మధ్యలో వచ్చే సీన్ పవర్ ఫుల్ గా అనిపిస్తుంది. కానీ ఎక్కడా కూడా హద్దు దాటినట్టు అనిపించదు. కమర్షియల్ సినిమాల్లో ఎక్కువగా ఉండే యాక్షన్ సీన్స్ లాగా అనిపించదు. అంత బాగా ఈ సీన్ ని డిజైన్ చేసుకున్నారు. కానీ తమిళ్ లో ఇందుకు చాలా డిఫరెంట్ గా చేశారు. హీరోకి చెయ్యి పట్టేస్తే చేయిని తిప్పి తర్వాత ప్రకాష్ రాజ్ ని కొడతాడు.
ఆ సీన్ చూడడానికి చాలా కామెడీగా అనిపిస్తుంది. అంత సీరియస్ సీన్ లో ఇలాంటి యాక్షన్ సీన్ పెడితే కాస్త ట్రాక్ తప్పినట్టు అనిపిస్తుంది. దీని విషయంలో కూడా అలాగే జరిగింది. ఈ సినిమాలో ఈ ఒక్క సీన్ మాత్రమే కాదు, స్వప్నని ఓబుల్ రెడ్డి ఎత్తుకెళ్లే సీన్ లో హీరో ఫోన్ మాట్లాడి, తర్వాత హీరోయిన్ ని చూసి, కాస్త కంగారు పడి, ఏం జరిగింది అనేది ఆలోచిస్తూ ఉంటాడు. అదంతా మనకి కొన్ని సెకండ్లలో తెలుగులో చూపిస్తారు. కానీ తమిళ్ సినిమాలో మాత్రం ఈ సీన్ కొంచెం మార్చారు. మిట్ట మధ్యాహ్నం చలికి వేసుకునే జాకెట్ వేసుకొని హీరో జాగింగ్ చేస్తూ ఉంటే, పక్కన నుండి త్రిష ని ప్రకాష్ రాజ్ తీసుకెళ్తూ ఉంటారు. ఆ సీన్ తెలుగు సీన్ బాగా చూసిన వాళ్లకి అంత సీరియస్ గా అనిపించదు. దాంతో తమిళ్ రీమేక్ సీన్ మీద కామెంట్స్ చేస్తున్నారు.
watch video :
ALSO READ : హీరోయిన్ నగ్మా గుర్తున్నారా..? ఇప్పుడు ఎలా మారిపోయారో చూసారా..?
End of Article