తెలుగు సినిమా ముఖ చిత్రం నందమూరి తారక రామారావు గారు. పౌరాణిక పాత్రలైనా, సాంఘిక పాత్రలైనా ఆయన చేస్తే సూపర్ హిట్ అవ్వాల్సిందే. పరిశ్రమలో నటసార్వభౌముడుగా నందమూరి తారకరామారావు ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఖ్యాతిని సంపాదించారు.
అప్పట్లో ఆయనతో నటించాలని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కోరుకొనే వారు. ఎన్టీఆర్ పక్కన ఒక్కసారి కనిపిస్తే చాలు అని అనుకునే వారు.
Video Advertisement
అన్న గారి సినిమాలో ఛాన్స్ ఇప్పించండి అంటూ స్పెషల్ రిక్వెస్ట్ లు కూడా చేసుకునేవారట. ఎన్టీఆర్ తరం వారు మాత్రమే కాదు ఆ తర్వాత తరం వారు కూడా ఎన్టీఆర్ సినిమా లో ఒక్క ఛాన్స్ వచ్చినా చాలు అని ఎంతో ఆశగా ఎదురు చూసే వారు.
వాస్తవానికి తెలుగు సినీ రంగంలోని అందరు హీరోయిన్లు కూడా.. అన్నగారితో కలిసి నటించిన వారే. సావిత్రి నుంచి శ్రీదేవి వరకు అందరూ అన్నగారితో కలిసి డ్యాన్సులు చేసినవారే.. వెండితెరపై నటించిన వారే. కానీ స్టార్ హీరోయిన్ అయిన సుహాసిని కి అన్న గారితో కలిసి నటించే అవకాశం రాలేదు.
అన్నగారు మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే.. సుహాసిని కూడా రంగంలో ఉన్నారు. అయితే.. ఆమెకు అన్నగారితో నటించాలని కోరిక ఉండేది. ఈ విషయమే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 1983లో వచ్చిన స్వాతి సినిమాలో క్యారెక్టర్ నటుడు పాత్ర కోసం సుహాసిని అన్న గారిని సంప్రదించిందని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.ఈ సినిమాలో శారద నటించిన స్వాతి పాత్రకు తల్లి పాత్ర చేసింది.
చిన్నప్పుడే భర్తను కోల్పోయిన తన తల్లి కి మళ్లీ పెళ్లి చేసింది స్వాతి.భర్త గా కొంగర జగ్గయ్య నటించారు.జగ్గయ్య పాత్రకోసం ఎన్టీఆర్ ను తీసుకోవాలని దర్శకుడు క్రాంతికుమార్ అనుకున్నారట.కానీ అన్నగారు అప్పటికే పార్టీ ని ప్రారంభించే కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో చివరికి ఈ సినిమా ఒప్పుకోలేక పోయారు.
ఇలా అన్న గారితో నటించే అవకాశం మిస్ చేసుకున్న సుహాసిని. ఆ తర్వాత మాత్రం నటించే అవకాశం అందుకోలేకపోయింది. కానీ ఎన్టీఆర్ తనయుడు బాలయ్యతో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాల్లో నటించారు ఆమె.
కమల్ హాసన్ సోదరుడు చారు హాసన్ కుమార్తె అయిన సుహాసిని దర్శకుడు మణిరత్నం ను వివాహం చేసుకున్నారు. అడపా దడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను పలకరిస్తున్నారు సుహాసిని.