ఉదయం కనిపించదు… మధ్యాహ్నం అయితే కనిపించే ఈ ఆలయం గురించి మీకు తెలుసా.?

ఉదయం కనిపించదు… మధ్యాహ్నం అయితే కనిపించే ఈ ఆలయం గురించి మీకు తెలుసా.?

by Megha Varna

Ads

మీరు చాలా ఆలయాలకి వెళ్లి ఉండొచ్చు. కానీ ఇటువంటి ఆలయం గురించి ఎప్పుడు విని ఉండరు. నిజంగా ఈ ఆలయం గురించి, ఈ ఆలయ విశిష్టత గురించి చూశారంటే షాక్ అవుతారు. మీరు ఈ ఆలయాన్ని కనుక చూసి ఉండకపోతే గొప్ప గమ్మత్తుగా ఉంటుంది. అయితే మరి ఆ ఆలయం గురించి ఇప్పుడు ఎన్నో విషయాలను మనం తెలుసుకుందాం.

Video Advertisement

ఈ ఆలయం చాలా స్పెషల్. ఎందుకంటే మనం అక్కడికి ఉదయాన్నే వెళ్ళాము అనుకోండి.. అప్పటికే ఆలయం కనపడదు. కేవలం మనకి ఆలయం వుంది అని చెప్పడానికి ఒక ధ్వజస్తంభం మాత్రమే కనబడుతుంది. అదేంటి ఆలయం ఏమవుతుంది అని ఆశ్చర్యపోతున్నారా..? మధ్యాహ్నం ఒంటి గంట అయ్యేసరికి ఈ ఆలయం మనకి కనపడుతుంది.

ఎందుకంటే ఒంటిగంట నుంచి సముద్రం వెనక్కి వెళుతూ ఉంటుంది. దీంతో ఆలయాన్ని చూడటానికి మనం వెళ్ళాలి అంటే ఒక మార్గం దొరుకుతుంది. అక్కడి నుంచి మనం నడుచుకుంటూ నిష్కలంక మహాదేవ ఆలయ శివలింగం దగ్గరకి వెళ్లి పూజలు చేసుకోవచ్చు. ఇక ఈ ఆలయం గురించి పూర్తి వివరాల్లోకి వెళితే… గుజరాత్ రాష్ట్రంలోని,భావనగర్ పట్టణానికి దగ్గరలో ఉన్న కొలియాక్ గ్రామానికి దగ్గరలో అరేబియా సముద్రం లో నిష్కలంక మహాదేవ ఆలయం ఉంది. ఉదయం అంతా కూడా నీళ్లతో నిండిపోతుంది. మధ్యాహ్నం సముద్రం వెనక్కి వెళ్తుంది కనుక అప్పుడు ఆలయం కనపడుతుంది.

మధ్యాహ్నం ఆ ఆలయానికి వెళితే రాత్రి పదిగంటల వరకూ అక్కడే వుంది రావచ్చు. ఆ తరవాత మళ్ళీ వచ్చేయాలి. లేదంటే మళ్ళీ సముద్రం ముందుకు వచ్చి ఆలయాన్ని నీటితో కప్పేస్తుంది. దీనితో రావడానికి అవ్వదు. మళ్ళీ మధ్యాహ్నం వరకు ఆలయం కనే కనిపించదు. ఈ ఆలయం లో వుండే ధ్వజస్తంభం ఎత్తు దాదాపు 20 మీటర్లు.

ఇంచుమించు అంత ఎత్తు దాకా నీళ్లు వచ్చేస్తాయి. ఇది నిన్నో మొన్నో వచ్చినది కాదు. అక్కడ కొన్ని వందల ఏళ్ళుగా ఇలానే జరుగుతోంది. ఈ దేవాలయాన్ని పాండవులు కట్టించారట. పౌర్ణమి రాత్రి పోటు సమయంలో పదిగంటల వేళ సముద్రం బాగా ముందుకు వచ్చి ఆలయాన్ని కప్పేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.


End of Article

You may also like