ఈ ట్రైన్ కి కిటికీలు తలుపులు ఉండవు..? కారణం ఏంటో తెలుసా..?

ఈ ట్రైన్ కి కిటికీలు తలుపులు ఉండవు..? కారణం ఏంటో తెలుసా..?

by kavitha

ఇండియన్ రైల్వే ప్యాసింజర్ ట్రైన్ నుండి గూడ్స్ ట్రైన్ వరకు పలు రకాల ట్రైన్స్ ను నడుపుతోంది. రీసెంట్ గా ప్రారంభం అయిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ కూడా జనాధారణ పొందుతున్నాయి. ఇక ఇండియన్  రైల్వే నడిపే ట్రైన్స్ లో ప్రతీ బోగీకి తలుపులు రెండు వైపులా ఉంటాయి.

Video Advertisement

అలాగే రైలు బోగీకి కిటికీలు ఉంటాయి. కానీ ఒక రైలుకు తలుపులు కానీ, కిటికీలు కానీ ఉండవు. అలాంటి ట్రైన్ ను ఎప్పుడైనా చూశారా? మరి కిటికీలు, తలుపులు లేని ట్రైన్ ను ఏమంటారో? దానికి కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
NMG-Trains-2తలుపులు, కిటికీలు, లేని ట్రైన్స్ ఉంటాయి. కొన్నిట్రైన్స్ బోగీలకు తలుపులు, కిటికీలు ఉండవు. పూర్తిగా క్లోజ్ చేసి ఉంటుంది. వీటిని ఎన్ఎంజీ ట్రైన్స్ అంటారు. మిగతా రైళ్లతో పాటుగా ఎన్ఎంజీ ట్రైన్ ను కూడా ఇండియన్ రైల్వే నడుపుతోంది. సాధారణంగా రైలు ప్రయాణం చేసేవారు ఎక్కడో ఒక చోట ఎన్ఎంజీ రైలును గమనించే ఉంటారు. ప్యాసింజర్ ట్రైన్స్ ను ఎన్ఎంజీ రైళ్లుగా మారుస్తారు.
ఎన్ఎంజీ రైలు అంటే..

ఎన్ఎంజీ అనగా న్యూ మాడిఫైడ్ గూడ్స్. ఈ ట్రైన్స్ ను ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెహికిల్స్ రవాణా చేయడం కోసం ఉపయోగిస్తారు. కార్లు, బైకులు, ట్రాక్టర్లు లాంటి వాహనాలను ఎన్ఎంజీ రైలులో రవాణా చేస్తారు. వాహనాల భద్రత కోసం ఆ బోగీలాకు తలుపులు, కిటికీలు లేకుండా చేస్తారు. ప్యాసింజర్ ను ఎన్‌ఎంజీ రైలుగా మార్చిన తర్వాత 5-10 ఏళ్ల వరకు ఉపయోగిస్తారు.
ప్యాసింజర్ – ఎన్ఎంజీ రైళ్లు..

సాధారణ ప్యాసింజర్ రైలు కు 25 సంవత్సరాల సర్వీసు పూర్తి అయిన తరువాత వాటిని ప్రయాణికుల అవసరాలకు వినియోగించరు. ఆటో క్యారియర్ గా మార్చేస్తారు. ప్యాసింజర్ కోచ్‌ను ఎన్ఎంజీ రైలుగా మార్చేప్పుడు బొగిలను పూర్తిగా సీల్ చేస్తారు.లోపల ఉండే సీట్లన్నీ తొలగిస్తారు. లైట్లు, ఫ్యాన్లు  తీసివేసి, దృఢంగా మార్చడం కోసం ఐరన్ స్ట్రిప్స్ ను  వాడతారు. దీనినే ఎన్ఎంజీ అంటారు. కార్లు, ట్రాక్టర్లు, మినీ ట్రక్కులు వంటి వెహికిల్స్ ను ట్రాన్స్ పోర్ట్ చేయడానికి ఉపయోగిస్తారు.

Also Read: రైలు హెడ్‌లైట్‌లో ఉండే బల్బులు ఎన్ని..? అవి ఎంత దూరం వరకు కనిపిస్తాయంటే..!


You may also like