పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం తొలిప్రేమ. ఈ సినిమాకి కరుణాకరణ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఎవర్‌ గ్రీన్‌ ప్రేమకథల్లో ఒకటిగా చెప్పవచ్చు.

Video Advertisement

ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి రెడ్డి నటించగా, పవన్‌ కల్యాణ్ చెల్లెలుగా నటించిన వాసుకి బుజ్జి క్యారెక్టర్ లో అద్భుతంగా నటించింది. ఆ మూవీ తరువాత వాసుకి ఇండస్ట్రీకి దూరం అయ్యారు. తాజాగా రీఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఆమె మళ్ళీ నటించడానికి గల కారణాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
తొలిప్రేమ మూవీ సూపర్‌హిట్ అవడంతో పాటు వాసుకి నటనకు మంచి గుర్తింపు వచ్చింది. దాంతో ఆమె సినిమాలలో  నటిస్తూ బిజీగా మారుతుందని అందరు అనుకున్నారు. కానీ వాసుకి ఆ మూవీ తరువాత యాక్టింగ్ మానేసి, తొలిప్రేమ మూవీ ఆర్ట్ డైరెక్టర్‌ పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ ఆనంద్ సాయి‌ని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ఆమె పిల్లలు, ఫ్యామిలీ జీవితంతో బిజీ అయిపోయింది. దాదాపు 23 సంవత్సరాల తర్వాత వాసుకి ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది.
ఈ చిత్రంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో హీరో సంతోష్ శోభన్ సిస్టర్ క్యారెక్టర్ లో వాసుకి నటిస్తున్నారు. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. విందా మూవీస్, స్వప్న సినిమా సంస్థల పై ప్రియాంక దత్, స్వప్న దత్, ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాను మే 18న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీలో నటించిన వాసుకి మీడియాతో మూవీ విశేషాలు మరియు ఆమె మళ్ళీ సినిమాలలో నటించడానికి గల కారణాలను వెల్లడించారు.
వాసుకి మాట్లాడుతూ ‘‘తొలిప్రేమ సినిమా తరువాత చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ నాకు నటించడం కుదరలేదు.పెళ్లి, పిల్లలు, వాళ్ళ చదువులు వీటితో నటించడం కుదరలేదు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు పెద్దగా అయ్యారు. యూకేలో పాప మెడిసిన్, బాబు ఆర్కిటెక్చెర్ చదువుతున్నారు. నా భర్త తన పనిలో బిజీగా వుంటారు. దాంతో ప్రస్తుతం ఏదైనా చేయడానికి నాకు టైమ్ కుదిరింది. ఇలాంటి టైమ్ లోనే డైరెక్టర్ నందిని రెడ్డి ‘అన్నీ మంచి శకునములే’ కథ చెప్పారు. ఆ కథ నచ్చడంతో ఈ చిత్రంలో నటించానని వెల్లడించారు.

Also Read: “మహేష్ బాబు” జక్కన్న సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడంటే..?