టిక్ టాక్ “ దుర్గారావు” నెల సంపాదన ఎంతో తెలుసా.?

టిక్ టాక్ “ దుర్గారావు” నెల సంపాదన ఎంతో తెలుసా.?

by Mohana Priya

Ads

టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన వాళ్లలో దుర్గా రావు ఒకరు. దుర్గా రావు ఇంకా ఆయన భార్య గంగా రత్నం కలిసి టిక్ టాక్ లో వీడియోలు చేసే వారు. దుర్గా రావు డాన్స్ వేస్తూ ఉంటే, గంగా రత్నం పక్కనే నుంచుని పాట పాడుతూ లిప్ సింక్ ఇస్తూ ఉంటారు. దాదాపు అన్ని వీడియోస్ ఇదే ఫార్మాట్ లో ఉంటాయి.

Video Advertisement

కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉండడంతో వీరిద్దరూ టిక్ టాక్ లో పాపులర్ అయ్యారు. యూట్యూబ్ లో కూడా వీరిద్దరి వీడియోస్ కి చాలా క్రేజ్ ఉంటుంది. ఇటీవల క్యాష్ ప్రోగ్రాం లో దుర్గా రావు, గంగా రత్నం వచ్చారు. అలాగే జబర్దస్త్, అదిరింది ప్రోగ్రామ్స్ ద్వారా కూడా మనల్ని అలరించారు.

అయితే సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన సెలబ్రిటీలు ఎంత సంపాదిస్తారో తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ చాలా మందికి ఉంటుంది. న్యూస్ 18 తెలుగు కథనం ప్రకారం ఇప్పుడు లాక్ డౌన్ రూల్స్ కూడా కొంచెం సడలించడంతో షూటింగ్స్ జరుగుతున్నాయి. షూటింగ్స్ తో పాటు ఈవెంట్స్ కూడా జరగడం మొదలయ్యాయి.

దాంతో దుర్గా రావు దంపతులకి ఈవెంట్స్ కి కూడా హాజరవడానికి ఆహ్వానాలు అందుతున్నాయట. అలాగే బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చేయమని ఆహ్వానాలు వస్తున్నాయి. ప్రస్తుతం దుర్గా రావు ఇంకా గంగా రత్నం యూట్యూబ్ నుంచి నెలకి దాదాపు యాభై వేల రూపాయలకు పైగా ఆదాయం అందుకుంటున్నారు.


End of Article

You may also like