టిక్ టాక్ రేటింగ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్ ఇవే!

టిక్ టాక్ రేటింగ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్ ఇవే!

by Megha Varna

Ads

టిక్ టాక్ ఈ యాప్ ఒక సంచలనం.బుల్లితెర స్టార్స్ ,వెండితెర స్టార్ లను మనం చూసాము మరియు విన్నాము.కానీ కొత్తగా ట్రెండ్ అయ్యింది మాత్రం టిక్ టాక్ స్టార్ అనే చెప్పాలి.ఈ యాప్ ను చిన్నపిల్లలా దగ్గర నుండి ఇంట్లో ఉండే మహిళలు వరకు అందరూ టిక్ టాక్ వీడియోస్ చేసి చాలామంది ఫేమస్ అయ్యారు.దేశమంతా కూడా టిక్ టాక్ మేనియా నడుస్తుంది.ఈ తరుణంలో టిక్ టాక్ కు ఒక దారుణమైన దెబ్బ తగిలింది.దేశంలోనే ఎక్కువగా డౌన్లోడ్ చేసుకుని బాగా వాడుతున్న యాప్ టిక్ టాక్ కానీ ప్రస్తుతం ప్లే స్టోర్ లో టిక్ టాక్ రేటింగ్ దారుణంగా పడిపోయింది.అసలు ఆలా జరగడానికి ప్రధాన కారణాలు ఏంటి..ఆ వివరాలేంటో చూద్దాం ..

Video Advertisement

ఈ వివాదం ఎలా మొదలైంది అంటే ఎల్విష్ ప్రసాద్ అనే ప్రముఖ యూట్యూబర్ టిక్ టాక్ వాడేవాళ్లు అందరూ కూడా చెత్తవాళ్ళు అంటూ కొన్ని కామెంట్స్ చేసారు.దీంతో ఫైర్ అయ్యినా టిక్ టాక్ యూజర్ అమిర్ సిద్దిఖీ యూట్యూబర్స్ కి ఏమిరాదు వేస్ట్ అంటూ కొన్ని కామెంట్స్ చేసారు.

దీంతో టిక్ టాక్ వెర్సస్ యూట్యూబ్ అంటూ ఒక పోటీ మొదలైంది.కాగా సోషల్ మీడియాలో అంతటా ఈ వివాదం జోరుగా సాగుతుంది.కాగా యూట్యూబర్స్ అంతా కూడా టిక్ టాక్ యూజర్లను అన్ని విధాలుగా ఆడుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ క్యారిమినాటి “యూట్యూబ్ వెర్సస్ టిక్ టాక్ ” అంటూ ఒక వీడియోను విడుదల చేసారు. ఆ వీడియోకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది .కాగా ఆ వీడియో ఎన్నో రికార్డులను సృష్టించింది.కానీ మే 14 నుండి ఒక్కసారిగా ఆ వీడియో యూట్యూబ్ నుండి మాయం అయింది.దీంతో క్యారిమినాటి తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు.ఈ నేపథ్యంలో యూట్యూబర్స్ అందరూ టిక్ టాక్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు .

దీంతో టిక్ టాక్ డౌన్లోడ్ చేసుకొని అతి తక్కువ రేటింగ్ ఇస్తూ అందరూ కూడా అలానే చేయాల్సిందిగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసారు.ఈ కారణాల వలన 4 .5 ఉండాల్సిన టిక్ టాక్ రేటింగ్ 1 కి పడిపోయింది.కాగా యూట్యూబర్స్ తో పెట్టుకుంటే మాములుగా ఉండదు మరి అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


End of Article

You may also like