Ads
టమాటా రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. కేజీ టమోటా ధర 100 దాటడంతో కొనుక్కోవడం కష్టమవుతోంది. చాలా కూరలు టమాటా లేకుండా చేయడం కుదరదు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో టమాటాలకి డిమాండ్ బాగా పెరిగింది. పైగా చాలా కూరల్లో మనం టమాటా ప్యూరీని వేయాల్సి వస్తుంది.
Video Advertisement
పైగా టమాటా లేకపోతే కూర రుచిగా ఉన్నా రుచించదు చాలా మందికి. అయితే టమాటాలకి బదులుగా వంటల్లో ఈ విధంగా ప్రయత్నం చేయండి. దీనితో టమాటా లేని లోటు కాస్త తీరుతుంది.
#1. ఉసిరి:
ఉసిరి చాలా పుల్లగా ఉంటుంది. పైగా ఆరోగ్యానికి కూడా ఇది మంచిది. ఉసిరిని గుజ్జు తీస్తే టమాటా గుజ్జులా ఉంటుంది. టమాటా ప్యూరి కావాలంటే ఉసిరి కాయలను ఉడకబెట్టి అందులో బెల్లం కలపండి. ఇది పుల్లగా, తియ్యగా ఉంటుంది. ఈ విధానగా చేసి టమాటాకి బదులుగా దీనిని మీరు వంటల్లో ఉపయోగించవచ్చు.
#2. మిరపకాయ:
మిరపకాయలను కూడా మీరు టమాటా కి బదులుగా ఉపయోగించవచ్చు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలానే యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి.
#3. పండిన గుమ్మడి:
గుమ్మడి కాయని కూడా ప్యూరీ చేసి మీరు టమాటాలకి బదులుగా ఉపయోగించవచ్చు. గుమ్మడికాయ వల్ల కూడా మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అదే విధంగా విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు గుమ్మడికాయ గుజ్జు తీసి వెనిగర్ ని వేసి కూరల్లో వాడవచ్చు. టమాటా లాంటి రుచని గుమ్మడి ఇస్తుంది. ఇలా వంటల్లో టమాటాలకి బదులుగా వీటిని వాడి రుచిగా వంట చేసుకోచ్చు.
End of Article