Ads
ఏ చిన్న సమస్యని కూడా నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు. ప్రతి చిన్న సమస్యను కూడా తగ్గించుకునేందుకు మార్గాలను చూసుకోవాలి. సర్వేంద్రియానం నయనం ప్రధానమన్నారు అందుకని కంటి ఆరోగ్యం పట్ల తప్పక శ్రద్ధ పెట్టాలి. కళ్ళు లేకపోతే మనం దేనిని చూడలేము కంటికి సంబంధించిన సమస్యలు ఎప్పుడైనా వస్తే వాటిని అసలు నెగ్లెక్ట్ చేయకండి.
Video Advertisement
అయితే ఒక్కొక్కసారి కళ్ళు పొడిబారి పోతున్నట్లు ఉంటుంది. అటువంటప్పుడు ఎలాంటి చిట్కాలు ఫాలో అవ్వాలి ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం.
కళ్ళు పొడిబారిపోతున్నట్లయితే ఈ లక్షణాలు ఉంటాయి:
కళ్ళు మూసుకుపోవడం
మసకబారడం
ఎర్రగా ఉండడం
మంట
దురద
వాపు
కన్నీళ్లు రాకపోవడం
అసలు ఎందుకు ఈ సమస్య వస్తుంది..?
విటమిన్ సి లోపం
థైరాయిడ్
స్క్రీన్ల ముందు ఎక్కువ సేపు గడపడం
హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్
ఎలర్జీ
వృద్ధాప్యం
కంట్లో దుమ్ము వంటివి పడడం
ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి..?
#1. ఎక్కువసేపు స్క్రీన్ల ముందు గడపకుండా చూసుకోండి. చాలామంది స్క్రీన్లని ఉపయోగించేటప్పుడు కళ్ళు పెద్దవి స్క్రీన్ లను చూస్తూ ఉంటారు కంటి రెప్ప కూడా వేయరు. ఇలా చేస్తే కళ్ళు పొడి బారిపోతాయి. పైగా మంట కూడా ఎక్కువగా వస్తుంది.
#2. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని ఉపయోగించేటప్పుడు మధ్యలో రెస్ట్ తీసుకుంటూ ఉండండి లేకపోతే కంటి సమస్యలు తప్పవు.
#3. నీళ్ళని ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే కళ్ళల్లో వుండే లాక్రిమల గ్రంధులు ఎక్కువ నీళ్లు తీసుకోకపోతే సరిగ్గా పని చేయవు.
#4. ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కళ్ళు పొడిబారి పోవడం వంటి సమస్యలు కలగవు.
#5. అలానే ఏసీ కూలర్ వంటి వాటి నుండి వచ్చే గాలి నేరుగా కళ్ళ మీద పడకుండా చూసుకోండి.
#6. కంప్యూటర్ మీద ఎక్కువ పని చేసే వాళ్ళు లెన్స్ ని ఉపయోగించకుండా చూసుకోండి.
#7. ఐ మేకప్ వేసుకోవడం వల్ల కూడా సమస్యలు వస్తాయి కాబట్టి కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఉపయోగించకుండా ఉండటమే మంచిది.
#8. కాఫీ, ఆల్కహాల్ వంటి కెఫీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది.
End of Article