ఉల్లిపాయల్ని కట్ చేసేటప్పుడు…కళ్ళు మండకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి.!

ఉల్లిపాయల్ని కట్ చేసేటప్పుడు…కళ్ళు మండకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి.!

by Megha Varna

Ads

ఉల్లి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పైగా మనం ఇంచుమించు అన్ని వంటల్లో కూడా ఉల్లిని వాడుతూ ఉంటాము. ఉల్లిని మనం ఏ రెసిపీలో వేసినా మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. పైగా ఆరోగ్యానికి ఉల్లిపాయలు బాగా ఉపయోగ పడతాయి. ఉల్లిపాయలలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది.

Video Advertisement

అలానే ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి. రక్తాన్ని ప్యూరిఫై చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పైగా ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి రోగాలు కూడా రావు.

పళ్లలో ఉండే ఇన్ఫెక్షన్స్ ను కూడా ఇది తొలగిస్తుంది. అయితే నిజానికి ఉల్లి వల్ల చాలా లాభాలు ఉన్నప్పటికీ తరగడం కష్టం. ఉల్లిపాయలు తరుగుతూ ఉంటే కళ్లల్లో నుంచి నీళ్లు అలా వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఉల్లిపాయలను ఎలా సులభంగా తరగాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఉల్లిపాయలను ఈజీగా తిరగడానికి ఈ టిప్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. పైగా ఇవి చాలా ఈజీ కూడా. మీరేం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు.

ఉల్లిపాయలను కట్ చేసేటప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్లు రాకుండా ఉండాలంటే ఇలా ఫాలో అవ్వండి. ఉల్లిపాయలను కట్ చేసే ముందు కాసేపు వెనిగర్ లో వెయ్యండి. ఇలా చేయడం వల్ల కళ్ళల్లో నుండి నీళ్ళు రావు. సులభంగా తరుకోచ్చు.
అదే విధంగా ఉల్లిపాయలు తరిగే ముందు మూడు నుండి నాలుగు గంటల సేపు ఫ్రిజ్లో వాటిని పెట్టండి ఇలా చేయడం వల్ల కూడా ఈజీగా ఉల్లిపాయలును తరుక్కోచ్చు. కళ్ళు మండవు.

పైభాగం నుండి కాకుండా కింద నుండి ఉల్లిపాయలు తరగడం వల్ల తొందరగా తరగచ్చు. మీరు ఉల్లిపాయని కట్ చేసే ముందు కత్తి పీట కి కానీ మీరు ఉపయోగించే చాకుకి కానీ నిమ్మరసం రాసి తరిగితే కన్నీళ్లు రావు. ఇలా అయితే ఇబ్బంది ఏమి లేకుండా ఈజీగా ఉల్లిపాయల్ని కట్ చేసుకోవడానికి అవుతుంది.


End of Article

You may also like