బియ్యం, పప్పులు కల్తీ అయ్యాయా లేదా అనేది.. ఇలా టెస్ట్ చెయ్యండి..!

బియ్యం, పప్పులు కల్తీ అయ్యాయా లేదా అనేది.. ఇలా టెస్ట్ చెయ్యండి..!

by Megha Varna

Ads

మనం తీసుకునే ఆహార పదార్థాలని కల్తీ చేస్తూ ఉంటారు. నిజానికి అటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. కల్తీ చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యల మొదలు ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.

Video Advertisement

అందుకని తీసుకునే ఆహారం నిజమైనదా లేదా అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా బియ్యం, పప్పులు వంటి వాటిని కల్తీ చేస్తూ ఉంటారు.

పప్పుల్లో కల్తీ:

పప్పులు విషయానికి వస్తే కేసరి పప్పు, గులకరాళ్ళని, రంగుని వేసి కల్తీ చేస్తూ ఉంటారు.

బియ్యంలో కల్తీ:

బియ్యంలో అయితే ప్లాస్టిక్ బియ్యంని, బంగాళదుంపలను బియ్యంతో కలిపి కల్తీ చేస్తూ ఉంటారు. కల్తీ చేసిన బియ్యం తినడం వలన జీర్ణం సరిగ్గా అవ్వదు జీర్ణ వ్యవస్థ పాడవుతుంది. వంటకి కల్తీ బియ్యాన్ని ఉపయోగిస్తే విచిత్రమైన వాసన దాని నుండి వస్తుంది. అలానే అది పచ్చిగా కూడా ఉంటుంది.

rice 1

నకిలీ ఆహార పదార్థాలను ఎలా గుర్తించాలి..?

కాయధాన్యాలు యొక్క రంగు వాసనని పరిణామాన్ని రకాన్ని సపరేట్ చేసి మీరు నకిలీ అని గుర్తించొచ్చు.

బియ్యం కల్తీ అయిందా లేదా అనేది ఇలా చూడండి:

#1. కాల్చి చూడండి:

కొంచెం బియ్యం తీసుకుని వాటిని కాల్చండి ఇప్పుడు మీకు బర్నింగ్ స్మెల్ వస్తే అది ప్లాస్టిక్ రైస్ అని కనుగొనవచ్చు. అలాగే వండినా కూడా అది వండడానికి అవ్వదు.

#2. వాటర్ టెస్ట్:

ఒక బకెట్ తీసుకుని అందులో నీళ్లు వేసి బియ్యాన్ని వేయండి. ఒకవేళ కనుక బియ్యం పైకి తేలుతున్నాయంటె అవి నిజమైన బియ్యం అని.. మునిగిపోతున్నాయి అంటే అది ప్లాస్టిక్ బియ్యం అని.

#3. ఫంగస్ టెస్ట్:

బియ్యాన్ని వండిన తర్వాత ఆ అన్నాన్ని మూడు నుండి నాలుగు రోజులపాటు ఒక బాటిల్ లో ఉంచండి ఫంగస్ రాలేదు అంటే కల్తీ జరిగినట్లు. ఫంగస్ వచ్చిందంటే అది నిజమైన బియ్యం అని తెలుసుకోవచ్చు.


End of Article

You may also like