Ads
నిద్ర సుఖమెరుగదు అంటుంటారు కానీ.. కొంచమైనా సుఖం గా నిద్రపట్టకపోతే తెల్లారి పనులన్నీ అన్యమస్కం గా చేస్తుంటాము. ఆరోగ్యకరం గా పనులు చక్కదిద్దుకోవాలంటే.. ముందు రోజు రాత్రి హాయిగా నిద్రపోవాలి.చాలా మంది కలత నిద్రపోతూ ఉంటారు. పడుకున్నట్లే ఉంటారు కానీ.. గాఢం గా నిద్రపోలేరు. ఫలితం గా రోజంతా అలసటను ఫీల్ అవుతూ ఉంటారు. సరైన పొజిషన్ లో పడుకుంటేనే నిద్ర హాయిగా పడుతుంది. అయితే కొందరు వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం ఎడమ వైపు తిరిగి పడుకుంటే ఆరోగ్య రీత్యా చాలా మంచిదట.
Video Advertisement
చాలా మంది ఈ మధ్య కాలంలో చాలా సమయం స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేవరకు స్మార్ట్ ఫోన్లను వాడుతూనే ఉన్నారు. వెబ్ షోలు, ఓటీటీలో సినిమాలు, సోషల్ మీడియా వంటి వాటి కోసం మొబైల్స్ నే ఎక్కువగా వాడుతున్నారు. పడుకునే ముందు మొబైల్ చూడడం ప్రమాదకరం అని ఒక పరిశోధనలో తేలింది. ఆ పరిశోధనలో నిద్రపోయే ముందు స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం వల్ల కలిగే సమస్యల గురించి వెల్లడించారు.
రాత్రిపూట చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు నిద్రలేమి సమస్యలు కలగకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు నిద్రపోయే ముందు స్క్రీన్లకు దూరంగా ఉండండి. టీవీ ఫోన్ల వల్ల వచ్చే లైట్స్ వలన నిద్ర లేని సమస్యలు కలగవచ్చు. కనుక ఎప్పుడూ కూడా నిద్రపోయే ముందు వీటికి దూరంగా ఉండాలి. మీ గదిని ప్రశాంతంగా ఉంచుకోండి. మంచిగా నిద్ర పట్టేలా ఉంచుకోండి. మీ గది మీ నిద్రను ఎఫెక్ట్ చేయొచ్చు. మంచి మ్యూజిక్ వినడం వల్ల నిద్ర బాగా పడుతుంది. కాబట్టి ప్రశాంతకరమైన మ్యూజిక్ ని వింటే మంచిది.
End of Article