పిల్లల చదువు పట్ల కచ్చితంగా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి పిల్లల్లో రైడింగ్ స్కిల్స్ ని పెంచడానికి తల్లిదండ్రులు కాస్త కృషి చేయాలి. ఈ ఎనిమిది టిప్స్ ని ఫాలో అయితే పిల్లల్లో రీడింగ్ స్కిల్స్ ని తల్లిదండ్రులు పెంచొచ్చు.

Video Advertisement

#1. పిల్లల్ని పైకి చదవమనండి:

పిల్లలు చదివేటప్పుడు వాళ్ల దగ్గర కూర్చుని పైకి ఒక సారి చదవమని చెప్పండి. బయటకి పెద్దగా చదవడం వల్ల వాళ్లలో గ్రహణ శక్తిని పెంచొచ్చు. అలాగే వాళ్ళల్లో వొకాబ్యులరీ కూడా పెరుగుతుంది. కనుక పిల్లలు లో రీడింగ్ స్కిల్స్ ని పెంచడానికి ఈ టిప్ ని పక్కా ఫాలో అవ్వండి.

#2. ప్రపంచంలోని ప్రతి సంగతిని తెలిసేలా చెయ్యండి:

కేవలం చదువే కాకుండా పిల్లలకి బయట విషయాలు కూడా తెలిసేటట్లు చేయాలి. దాని గురించి పిల్లలతో చర్చించండి. వాళ్లతో మాట్లాడండి ఆ టాపిక్ మీద వాళ్ళకి అవగాహన కలిగేటట్టు చేయండి.

#3. లైబ్రరీ అలవాటు చేయండి:

పిల్లల కి లైబ్రరీ అలవాటు చేయడం కూడా మంచిది. ఇంట్లో కొన్ని పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు చేయొచ్చు లేదంటే లైబ్రరీకి తీసుకు వెళ్ళవచ్చు ఇలా పుస్తకాల మీద, చదువు మీద ఆసక్తి పెంచడానికి అవుతుంది.

#4. ట్యూషన్ పెట్టండి:

ఒకవేళ కనుక మీ పిల్లలు మీరు చెప్పేది వినక పోతే ఒక ప్రత్యేకమైన ట్యూటర్ ని పెట్టి చదివేటట్లు చేయండి. ఇలా పుస్తకాల మీద, చదువు మీద ఆసక్తి పెంచడానికి అవుతుంది.

#5. గోల్స్ పెట్టండి:

ఈరోజు ఇంత వరకు చదవాలి అని వాళ్ళకి గోల్డ్ పెట్టండి అప్పుడు కచ్చితంగా వాళ్ళు చదవడానికి అవుతుంది.

#6. కష్టంగా కాదు ఇష్టంగా చదివించండి:

పాఠ్య పుస్తకాలను పదే పదే చదవమంటే వాళ్ళు చదవరు కాబట్టి మీరు దీనిని ఆటలాగ చెయ్యండి. వాళ్ళతో వెదర్ రిపోర్ట్ ని చదవమని చెప్పడం, హోటల్ కి వెళితే మెనూ చదవమనడం, రోడ్డు మీద కనపడే బోర్డులను చదవమని చెప్పడం వంటివి చేయొచ్చు. ఇలా వాళ్ళల్లో మీరు రీడింగ్ స్కిల్స్ ని పెంచచ్చు.