1919 ఈ నాటి లెటర్ చూసారా …భారత రైళ్లలో మార్పులు తెచ్చేలాగా ఈ లెటర్ లో ఏముందంటే.?

1919 ఈ నాటి లెటర్ చూసారా …భారత రైళ్లలో మార్పులు తెచ్చేలాగా ఈ లెటర్ లో ఏముందంటే.?

by Mounika Singaluri

Ads

సుదూర ప్రయాణాలు చేయాలనుకున్నప్పుడు చాలామందికి మొదటిగా గుర్తొచ్చేది రైళ్లు మాత్రమే. ఎందుకంటే బస్సులు, విమానాలతో పోలిస్తే రైలు ప్రయాణం చాలా తక్కువ ఖర్చుతో, సౌకర్యంగా, సుఖంగా వెళ్లవచ్చు. రైళ్లలో ఆహారం తినడానికి నీరు తాగడానికి ఆహార పదార్థాలు లభిస్తాయి. అత్యవసరంగా కాలకృత్యాలు తీసుకోవడానికి ఫ్రెష్ అవ్వడానికి రైళ్లలో బాత్రూములు కూడా ఉంటాయి.

Video Advertisement

రాత్రి వేళలో ప్రయాణానికి సౌకర్యంతంగా పడుకుని వెళ్లేందుకు స్లీపర్ క్లాస్ బోగీలు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే రైళ్లలో బాత్రూంలో ఎప్పుడు ఏర్పాటు చేశారో తెలుసా నిజం చెప్పాలంటే 1919 వరకు రైళ్లలో బాత్రూంలో ఉండేవి కాదు. ఆ సంవత్సరంలో ఒక వ్యక్తి రాసిన లేక కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం రైలలో బాత్రూములు ఏర్పాటు చేసింది.

బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించిన సమయంలో చేసిన మంచి పని ఏదైనా ఉందంటే రైలు మార్గాలు ఏర్పాటు చేయడమే. బ్రిటిష్ వాళ్లు రవాణా చేయడం కొరకు రైలు మార్గాన్ని అభివృద్ధి చేశారు. నేటికీ బ్రిటిష్ కాలం నాటి నిర్మించిన రైల్వే ట్రాక్లను మనం వాడుతున్నాం.అసలు విషయానికొస్తే ఓకిల్ చంద్రసేన్ అనే వ్యక్తి 1919లో రైలులో అహ్మద్ పూర్ స్టేషన్ వరకు ప్రయాణించాడు. ఆ ప్రయాణంలో అతడు కడుపు ఉబ్బిపోయి చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో తాను ఎదుర్కొన్న ఇబ్బందిని వివరిస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశాడు.

డియర్ సార్ నేను రైలులో అహ్మద్ పూర్ స్టేషన్ వరకు ప్రయాణించాను. ఆ సమయంలో నేను విసర్జనకు వెళ్లాల్సి వచ్చింది. నేను ఓ స్టేషన్ లో టాయిలెట్ కి వెళ్ళాను. అయితే నేను అక్కడ ఉండగానే రైలు స్టార్ట్ అయింది. గార్డు నన్ను పట్టించుకోలేదు. ఒక చేతిలో కుండా మరొక చేతితో దోతి పట్టుకుని రైలు కోసం ప్లాట్ ఫామ్ పై పరిగెత్తాను. ఆ సమయంలో నా పంచ ఊడిపోయింది. అక్కడ ఉన్న స్త్రీలు పురుషులు ముందే నేను సిగ్గుపడవలసి వచ్చింది. నేను నా రైలు కూడా మిస్ అయ్యాను. నేను అహ్మద్ పూర్ స్టేషన్ లోనే ఉండిపోయాను.

 

టాయిలెట్ కి వెళ్ళిన ప్రయాణికుడి కోసం రైలు గార్డు కొన్ని నిమిషాలు కూడా ఆగకపోవడం బాధాకరం. అతడికి వెంటనే జరిమానా విధించాలని కోరుతున్నాను అని లేఖ రాశాడు.ఈ లేక చదివిన బ్రిటిష్ వారు రైళ్లలోనే టాయిలెట్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అలా వకీల్ చంద్రసేన్ కారణంగా భారతీయ రైలులో టాయిలెట్ సౌకర్యాలు మెరుగయ్యాయి.ప్రస్తుతం భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా అవతరించింది. ప్రతినిత్యం లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తుంది.

Also Read:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి “వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి” చేతిరాత చూశారా..? ఎంత బాగుందో..?


End of Article

You may also like