ప్రేమ కి భాష తో పనిలేదు. భావమే ముఖ్యం అని మన టాలీవుడ్ హీరో లు ఎప్పుడో ప్రూవ్ చేసేసారు. తెలుగు రాకపోయినా.. వారితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఆ హీరోయిన్లు కూడా మనకి తెలిసిన వారే. ఆ తరువాత వారు కూడా తెలుగు నేర్చుకున్నారు అనుకోండి.. అది వేరే విషయం.. ఇంతకీ.. ఇతర భాషల హీరోయిన్లను పెళ్లి చేసుకున్న ఆ టాలీవుడ్ హీరోలు ఎవరో చూసేద్దాం రండి.

#1 సూపర్ స్టార్ మహేష్ బాబు:

mahesh namrata
మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె మరాఠి అమ్మాయి. సినిమాల్లోకి రాకముందే నమ్రత మిస్ ఇండియా గా ఎంపికైంది. ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది. వంశి సినిమా లో నమ్రత, మహేష్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ టైం లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీరికి ఇద్దరు పిల్లలు. గౌతమ్, సితార లు కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. నమ్రత కు మొదట్లో తెలుగు రాకపోయినా.. తర్వాత్తర్వాత నేర్చుకున్నారు.

#2 అక్కినేని నాగ చైతన్య:

naga chaitanya samantha
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ జంటల్లో వీరిది కూడా ఒకటి. ఏ మాయ చేసావే సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయిన సమంత , నాగ చైతన్యలు ఒకరినొకరు ఆ సినిమా షూటింగ్ టైం లోనే ఇష్టపడ్డారు. సమంత మలయాళీ క్రిష్టియన్. ఆమె మాతృ భాష మలయాళం అయినప్పటికీ.. తెలుగు ఇండస్ట్రీ కి వచ్చాక తెలుగు కూడా నేర్చుకున్నారు. వీరిద్దరూ ప్రేమించి ఒక్కటైనా సంగతి తెలిసిందే.

#3 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్:

pavan renu desay
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ జంట కి విపరీతమైన క్రేజ్ ఉండేది. అయితే.. ప్రస్తుతం వీరిద్దరూ వేరు గా ఉంటున్నారు. వీరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అకిరా, ఆద్య అని వీరికి ఇద్దరు పిల్లలు. రేణు దేశాయ్ పవన్ తో బద్రి సినిమా లో నటించింది. ఆ టైం లోనే వీరు ప్రేమించుకుని, ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. రేణు దేశాయ్ వాస్తవానికి గుజరాతి అమ్మాయి. ప్రస్తుతం రేణు దేశాయ్ తన పిల్లలతో కలిసి పూణే లో నివాసం ఉంటున్నారు.

#4 అక్కినేని నాగార్జున:

nag and amala
అక్కినేని నాగార్జున అమలను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అమల బెంగాలీ అమ్మాయి. అమల మంచి డాన్సర్ కూడా. చిన్నబాబు సినిమా లో అమల, నాగార్జున కలిసి నటించారు. వీరి మధ్య స్నేహం ప్రేమ గా మారడం తో పెళ్లి చేసుకున్నారు. వీరికి అఖిల్ సంతానం.