మన టాలీవుడ్ లో సొంత విమానాలు కలిగిన హీరోలు ఎవరో తెలుసా..?

మన టాలీవుడ్ లో సొంత విమానాలు కలిగిన హీరోలు ఎవరో తెలుసా..?

by Anudeep

Ads

సినిమా స్టార్లంటే వారికి ఓ రేంజ్ ఉంటుంది. ఖరీదైన ఇల్లు, విలాసవంతమైన జీవితం, ఖరీదైన కార్లలో తిరగడం.. ఇలా వారి రేంజే వేరు అన్నట్లు ఉంటుంది. మారుతున్న కాలం లో వారి స్థాయి ఖరీదైన కార్ల నుంచి.. సొంతం గా జెట్ లు కొనుక్కునే స్థాయి కి మారింది. ఎవరికైనా అలాంటి విలాసవంతమైన జీవితం గడపాలనే ఉంటుంది. అందుకే.. వారి జీవితాలపై అంత ఆసక్తి ని కనబరుస్తూ ఉంటారు.

Video Advertisement

ఇంతకీ.. మన టాలీవుడ్ లో కూడా నలుగురు స్టార్ లకు సొంతం గా జెట్ విమానాలు ఉన్నాయట. వారు వారి కుటుంబాలతో ఎక్కడికైనా ట్రిప్స్ కు వెళ్ళడానికి ఈ జెట్ విమానాలను ఉపయోగిస్తారట. ఇంతకీ ఆ నలుగురు స్టార్ లు ఎవరో ఓ లుక్ వేద్దాం రండి.

#1 నాగార్జున:

nagarjuna 1
టాలీవుడ్ కింగ్ నాగార్జున కు సొంతం గా జెట్ విమానం ఉంది. ఫామిలీ ట్రిప్స్ కోసమే ఈ జెట్ విమానాన్ని వినియోగిస్తారు. ఇటీవలే.. వైల్డ్ డాగ్ షూటింగ్ కు వెళ్లి రావడానికి కూడా నాగ్ సొంత జెట్ విమానాన్ని వినియోగించారు.

#2 చిరంజీవి:

megastar
మెగాస్టార్ చిరంజీవి కి కూడా ఇప్పటికే సొంతం గా జెట్ విమానం ఉందట. ఇందుకోసం రామ్ చరణ్ దాదాపు ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేసాడని తెలుస్తోంది.

#3 ఎన్టీఆర్:

ntr
ఎన్టీఆర్ కూడా ఇటీవలే దాదాపు ఎనభై కోట్లతో సొంత జెట్ విమానాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సొంతం గా ఫామిలీ ట్రిప్ ల కోసం దీనిని వినియోగించనున్నారట.

#4. అల్లు అర్జున్:

allu arjun
మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పెళ్లి అయిన తరువాత ఫామిలీ కోసమే జెట్ విమానాన్ని కొనుగోలు చేశారట. గతం లో కూడా ఈ ఫోటోలను మనం చూసే ఉంటాం.

ఈ జెట్ విమానాలను ఎక్కడ పెట్టుకుంటారు..? ఎలా మైంటైన్ చేస్తారో తెలుసా.. దగ్గర్లో ఉండే ఎయిర్ పోర్ట్ లలోనే వీటిని పార్క్ చేస్తారట. అక్కడి సిబ్బంది కి కొంత మొత్తాన్ని కూడా చెల్లిస్తారట. ఆ ఎయిర్పోర్ట్ సిబ్బందే ఈ విమానాల మైంటెనెన్సు సంగతి కూడా చూస్తారట. ఇందుకోసం ప్రతినెలా కొంత చెల్లిస్తారట. అలాగే.. వీరి అనుమతితోనే.. ఆ విమానాలను రెంట్ కి కూడా ఇస్తూ ఉంటారట. ఎంతైనా సెలెబ్రిటీల లైఫ్ లగ్జరీలే వేరు కదా..


End of Article

You may also like