నాచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న చిత్రం ‘దసరా’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సముద్రఖని, సాయికుమార్‌, జరీనా వహాబ్‌ తదితరులు ఈ చిత్రంలో కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుద‌ల కానుంది.

Video Advertisement

దసరా చిత్రం కోసం నాని తన లుక్స్ ని పూర్తిగా మార్చుకున్నాడు. కంప్లీట్ మాస్ హీరోగా మారిపోయాడు. తన తొలి పాన్ ఇండియా చిత్రం అయిన ఈ మూవీ లో నాని తన గత చిత్రాలకు భిన్నంగా కనిపించనున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ లో నాని..ధరణిగా పూర్తి డీ గ్లామర్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. రా అండ్‌ రస్టిక్‌గా ఈ ట్రైలర్‌ సాగింది.

story of nani's dasara movie..!!

అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ వచ్చింది. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు చాలా కట్స్ చెప్పడం విశేషం. సినిమా మొత్తం కలిపి 16 సీన్స్‌‌పై కట్స్ చెప్పింది సెన్సార్ బృందం. ఆడియో మ్యూట్, డైలాగ్స్ కట్స్ అన్నీ కలిపి చూసుకుంటే మొత్తం 36 చోట్ల కట్స్ చెప్పారట. ఇంత మొత్తంలో కట్స్ పెట్టిన ఈ చిత్రం ఈ విధంగా కూడా రికార్డు సృష్టించిందని చెప్పుకుంటున్నారు సినీ జనాలు.

too many cuts for nani's dasara movie.

కొన్ని చోట్ల సబ్ టైటిల్స్‌లో టెక్స్ట్ తీసేయాలని కూడా సెన్సార్ సభ్యులు చెప్పారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక ఫాంట్ సైజ్ పెంచమని చెప్పడం గమనార్హం. వాడుక భాషలోని కొన్ని పదాలు (బద్దల్ బాసింగలైతయ్, బా తో మొదలయ్యే తిట్టు) మ్యూట్ చేయాలని చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రంలో ధరణిగా నాని, వెన్నెలగా కీర్తి సురేష్ పాత్రలు ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతాయంటూ చిత్ర యూనిట్ చెబుతోంది.

too many cuts for nani's dasara movie.

గతేడాది ‘అంటే సుందరానికీ’ సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకున్న నాని  .. ఈ సారి పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణ లోని గోదావ‌రిఖ‌ని సమీపంలో ఉన్న సింగ‌రేణి ప్రాంతానికి చెందిన ఫిక్ష‌న‌ల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. గత కొన్ని రోజులుగా వస్తున్న మూవీ అప్డేట్స్ తో హైప్ పెంచేశారు మేకర్స్.