ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే 10 రైళ్లు ఇవే..! ఏమేమి ఉన్నాయంటే..?

ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే 10 రైళ్లు ఇవే..! ఏమేమి ఉన్నాయంటే..?

by kavitha

Ads

కొన్నేళ్ళ నుండి ప్రారంభం అయిన హై-స్పీడ్ రైళ్ల టెక్నాలజీ ఈ మధ్య కాలంలో మరింతగా అభివృద్ది సాధించింది. ఈ టెక్నాలజీ ద్వారా సమర్థవంతమైన, వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి.

Video Advertisement

ప్రపంచ వ్యాప్తంగా అనేక హై-స్పీడ్ రైళ్లు చాలా వేగంతో ప్రయాణిస్తున్నాయి. వాటిలో టాప్ 10అత్యంత వేగంగా వెళ్ళే రైళ్ల ఏమిటో, వాటి స్పీడ్ గురించి ఇప్పుడు చూద్దాం..
10-fastest-high-speed-trains1.షాంఘై మాగ్లేవ్ చైనా:

షాంఘై మాగ్లేవ్ ఈ  ట్రైన్ గంటకు 431 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఈ ట్రైన్ చాలా సాఫ్ట్ మరియు శబ్దం లేకుండా ప్రయాణిస్తుంది.

2. ఫక్సింగ్ హాఓ CR400AF/BF -చైనా:

ఈ ట్రైన్ బీజింగ్-షాంఘై రైలు మార్గంలో గంటకు 400 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఈ ట్రైన్ లో అత్యాధునిక సౌకర్యాలు, లేటెస్ట్ సేఫ్టీ సిస్టమ్స్‌ ను  కలిగి ఉంది.

3. CRH380A హెక్సీ – చైనా:

CRH380A హెక్సీ గంటకు 379 వేగంతో పనిచేస్తుండగా, ఇది పరీక్ష సమయంలో 302 mph వేగంతో దూసుకుపోయింది.
4. అల్స్టోమ్ అవెలియాAGV -ఇటలీ:

ఇటలీలో నడుస్తున్న ఫాస్టెస్ట్ రైల్ ఇది. ఈ ట్రైన్  గంటకు 360 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఈ రైలు ప్రయాణీకులకు విలాసవంతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది.
5. సిమెన్స్ వెలారో E/AVS 103-స్పెయిన్:

స్పెయిన్‌లో “AVE S-103” అని పిలుస్తారు.  ఈ ట్రైన్  గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది లేటెస్ట్ సేఫ్టీ సిస్టమ్స్‌తో ను  కలిగి ఉంది.6. షింకన్‌సెన్ హయబుసా E5 సిరీస్ (జపాన్):

ఈ ట్రైన్ జపాన్‌లోని షింకన్‌సెన్ లైన్‌లో గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
7. డ్యుయిష్ బాన్- జర్మనీ:

ఈ ట్రైన్ గంటకుగంటకు 329 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సుందరమైన జర్మన్ గ్రామీణ ప్రాంతాల గుండా ప్రయాణించే జర్మనీలోని అత్యంత వేగవంతమైన రైళ్లలో ఇది ఒకటి.
8. కోరైల్ KTX – దక్షిణ కొరియా:

ఈ ట్రైన్ గంటకు 329 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలు పశ్చిమాన ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తూర్పున తీరప్రాంత పట్టణమైన గాంగ్‌నెంగ్‌కు కలుపుతుంది.
9. టీజీవి (TGV) డ్యూప్లెక్స్ -ఫ్రాన్స్:

టీజీవి డ్యూప్లెక్స్ గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. దీని డబుల్ డెక్కర్ డిజైన్ తో ఎక్కువ సీటింగ్ సామర్థ్యాన్నికలిగి ఉంది.
10. టాల్గో 350-స్పెయిన్:

ఈ ట్రైన్ మాడ్రిడ్-బార్సిలోనా లైన్‌లో గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. Also Read: భారతీయ రైళ్లకు అసలు పేరు ఎలా పెడతారు.. దురంతో, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్ల పేర్లకు కారణం ఏమిటి..?


End of Article

You may also like