Ads
సినిమా ప్రేక్షకులకు బాగా రీచ్ అవ్వాలి అంటే చాలా అంశాలని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వాటిల్లో మొదటి ప్లేస్ లో ఉండేది సినిమా టైటిల్. సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడంతో ఈ టైటిల్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ టైటిల్ ని బట్టే ఏ సినిమాకి అయినా తొలి ఇంప్రెషన్ మొదలవుతుంది. మాములుగా ఏ సినిమాకి అయినా టైటిల్ పెట్టేముందు దర్శక నిర్మాతలు చాలానే ఆలోచిస్తారు. స్ట్రెయిట్ సినిమాలకు టైటిల్ పెట్టడం కొంత ఈజీనే అయినా..వాటిని డబ్ చేసేటప్పుడే అసలు చిక్కు మొదలవుతుంది.
Video Advertisement
ఆ సినిమాలకు పెట్టె టైటిల్స్ సదరు భాషా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉండాలి. నేటివిటీ కి దగ్గరగా ఉండే డైలాగ్స్ ని డబ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.. అయితే, ఈ టైటిల్స్ ని చూస్తే నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. అసలు సినిమాకి.. ఈ టైటిల్స్ కి సంబంధమే ఉన్నట్లు ఉండదు.
కొన్ని టైటిల్స్ ని చూస్తే మనకి నవ్వు వచ్చేస్తుంది. ఒక హిట్ అయిన సినిమా టైటిల్ ని మరో రెండు మూడు సినిమాలకు కూడా పెట్టేసి పార్ట్ 1 , పార్ట్ 2 అని సీక్వెల్ గా చెప్పేస్తూ డబ్ చేసేస్తారు. ఇలాంటి వీడియోస్ యూట్యూబ్ లో కోకొల్లలుగా ఉన్నాయి. ఉదాహరణకి ఎవడు సినిమానే తీసుకుంటే.. ఎవడు సినిమా ను డైరెక్ట్ గా హిందీ డబ్ చేసారు. హిందీ సినిమా టైటిల్ ని కూడా “ఎవడు” అనే ఉంచేశారు.
ఇక గోవిందుడు అందరి వాడేలే సినిమాను “ఎవడు 2” గా రిలీజ్ చేసారు. ఇంకా నవ్వొచ్చే విషయం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాని “ఎవడు 3” పేరు పెట్టి రిలీజ్ చేసేసారు. ఇంకా ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో ఓ 10 సినిమాల లిస్ట్ ఇక్కడ ఇస్తున్నాం. ఓ లుక్ వేసి హాయిగా నవ్వేసుకోండి.
#1. ఎవడు (తెలుగు) – “ఎవడు” (హిందీ)
#2. గోవిందుడు అందరివాడేలే (తెలుగు) – “ఎవడు 2” (హిందీ)
#3. అజ్ఞాతవాసి (తెలుగు) – “ఎవడు 3” (హిందీ)
#4. అత్తారింటికి దారేది (తెలుగు) – ఎవడు 4 (హిందీ)
#5. హలో గురు ప్రేమ కోసమే (తెలుగు) – “దుమ్దార్ ఖిలాడీ 1” (హిందీ)
#6. ఎంత మంచి వాడవురా (తెలుగు) – “దుమ్దార్ ఖిలాడీ 2” (హిందీ)
#7. నేనొక్కడినే (తెలుగు) – “రా ఖిలాడీ (Raw Khiladi) ” (హిందీ)
#8. నిన్ను కోరి (తెలుగు) – “ఆజ్ కా ఖిలాడీ” (హిందీ)
#9. గూఢ చారి (తెలుగు) – “ఇంటెలిజెంట్ ఖిలాడీ” (హిందీ)
#10. రేస్ గుర్రం (తెలుగు) – ” లక్కీ ది రేసర్” (హిందీ)
#11. బృందావనం (తెలుగు) – “ది సూపర్ ఖిలాడీ” (హిందీ)
#12. ఖలేజా (తెలుగు) – జిగర్ ఖలేజా (హిందీ)
#13. ఈడో రకం ఆడో రకం – (తెలుగు) – హైపర్ (హిందీ)
#14. శతమానం భవతి (తెలుగు) – సన్ అఫ్ కృష్ణ మూర్తి (హిందీ)
End of Article