కరోనా మహమ్మారి తర్వాత బాలీవుడ్ తో పాటు మిగిలిన ఇండస్ట్రీలు పరాజయాలతో సతమతమవుతుండగా టాలీవుడ్ మాత్రం అద్భుత విజయాలతో దూసుకుపోతున్నది. ఈ ఏడాది రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మొదలు సీతారామం, బింబిసార, కార్తికేయ 2 సినిమాలు దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్ని అలరించి టాలీవుడ్ సత్తాను చాటిచెప్పాయి.

Video Advertisement

మధ్యలో ఎన్నో అంచనాల నడుమ విడుదలైన కొన్ని చిత్రాలు ప్లాప్ అయినా ఎక్కువ నష్టాలు లేకుండా బయటపడింది టాలీవుడ్ ఇండస్ట్రీ.. అంతే కాకుండా హిట్ టాక్ వచ్చిన కొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

2022లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాలీవుడ్ సినిమాలు ఏవో చూద్దాం..

#1 ఆర్ ఆర్ ఆర్
ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ 2022లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన తెలుగు సినిమాల్లో టాప్ పొజిష‌న్‌లో ఉంది.ఇండియాలో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1135 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

top grossing telugu movies
#2 స‌ర్కారు వారి పాట‌
మ‌హేష్‌బాబు హీరోగా ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన స‌ర్కారువారి పాటకి యావరేజ్ టాక్ వచ్చినా .. 178 కోట్ల వ‌సూళ్ల‌తో ఈ ఏడాది హ‌య్యెస్ట్ గ్రాసింగ్ సినిమాల లిస్ట్‌లో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది.

top grossing telugu movies
#3 భీమ్లా నాయక్
పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీకి సాగర్ చంద్ర దర్శకుడు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.161 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

top grossing telugu movies
#4 రాధేశ్యామ్
రాధేశ్యామ్ ఫ్లాప్‌టాక్‌ను మూట‌గ‌ట్టుకున్న ప్ర‌భాస్‌కు ఉన్న క్రేజ్ కార‌ణంగా భారీగా ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. 151 కోట్లతో ఈ ఏడాది అత్య‌ధిక ఓపెనింగ్స్ రాబ‌ట్టిన సినిమాల్లో నాలుగో ప్లేస్‌లో నిలిచింది.

top grossing telugu movies
#5 ఎఫ్ 3
వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఎఫ్‌3 చిత్రం ఈ ఏడాది నిర్మాత‌ల‌కు అత్య‌ధిక లాభాల్ని మిగిల్చిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం 129 కోట్ల క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకున్న‌ది.

top grossing telugu movies
#6 కార్తికేయ 2
నిఖిల్ హీరోగా న‌టించిన కార్తికేయ 2 చిత్రం ఈ ఏడాది చిన్న సినిమాల్లో అతిపెద్ద విజయాన్ని సాధించింది. కృష్ణ‌త‌త్వానికి అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ అంశాల‌ను జోడించి ద‌ర్శ‌కుడు చందూ మొండేటి రూపొందించిన ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా 120 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. హిందీలోనే 30 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను సాధించింది.

top grossing telugu movies
#7 గాడ్ ఫాదర్
చిరంజీవి – సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీకి మోహన్ రాజా దర్శకుడు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.106 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

top grossing telugu movies

#8 సీతారామం
దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీకి హను రాఘవపూడి దర్శకుడు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.91 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

top grossing telugu movies
#9 ఆచార్య
చిరంజీవి రామ్‌చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టించిన ఆచార్య చిత్రం డిజాస్ట‌ర్‌గా నిలిచింది. దాదాపు 140 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 74 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి నిర్మాత‌ల‌కు న‌ష్టాల‌ను మిగిల్చింది.

top grossing telugu movies