Ads
డేవిడ్ వార్నర్ గతంలో ఐపీఎల్ లో ఎస్ ఆర్ హెచ్ జట్టులో ఇరగదీసాడు. అయితే.. కొన్నిసార్లు సరిగ్గా ఆడకపోవడం వల్ల ట్రోల్స్ ని కూడా ఎదుర్కున్న సంగతి తెలిసిందే. అయితే.. నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా ఇరగదీసాడు. దీనితో.. వింటేజ్ వార్నర్ ఈజ్ బ్యాక్ అంటూ వార్నర్ అభిమానులు మురిసిపోతున్నారు.
Video Advertisement
సరిగ్గా పెర్ఫార్మ్ చేయడం లో విఫలం అవ్వడంతో ఐపీఎల్ లో కెప్టెన్సీ నుంచి వార్నర్ ని తప్పించారు. తర్వాత, ప్లేయింగ్ ఎలెవన్ నుంచి కూడా తప్పించారు. మెగా టోర్నమెంట్స్ లో వార్నర్ ఆడలేడు అంటూ పలువురు విమర్శలు కూడా గుప్పించారు. ఈ విమర్శలన్నిటికి వార్నర్ నిన్న తన బ్యాటింగ్ తో సమాధానం చెప్పారు.
శ్రీలంక మరియు ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మ్యాచ్ లో శ్రీలంక 155 పరుగుల టార్గెట్ ను ఇచ్చింది. గేమ్ ను ప్రారంభించిన వార్నర్ తొలుత నిదానంగా పరుగులు ప్రారంభించి పది బంతుల్లో 40 (10 ఫోర్లు) పరుగులు చేసాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టి హుషారెత్తించాడు. మొత్తం 42 బంతుల్లో 65 పరుగులు చేసాడు. దీనితో.. వార్నర్ ఫామ్ లోకి వచ్చాడు అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ హోరెత్తుతున్నాయి.
#1.
#2.
#3.
#4.
#5.
#6.
#7.
#8.
#9.
#10.
End of Article