ఏదైనా మంత్రమో.. మహిమో చూపిస్తే మనం ఎవరినైనా నమ్మేస్తూ ఉంటాం. చాలా మంది మేజిక్ లకు పడిపోతూ ఉంటారు. అలా చేసి చూపించే వారికి ఏవో మహిమలు ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. వారు ఏది చెప్తే అది చేయడం ప్రారంభిస్తారు. గుడ్డి గా నమ్మేస్తూ ఉంటారు. ఇలా మోసం చేసే వారు తక్కువేమి కాదు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే పది వీడియోలలో ఐదారు వీడియోలు ఇలాంటివే ఉంటాయి. వినే వారు ఉంటె..చెప్పే వాళ్ళు ఎంతమంది అయినా పుట్టుకొస్తూనే ఉంటారు.

top trending trolls on elachi, erra daaram

 

ఈ మధ్య యూట్యూబ్ లో ఇలాంటి వీడియోలు ఎక్కువ అవుతున్నాయి. మీ ఇంట్లో ఫలానా ప్లేస్ లో ఇలాంటి చెంబులో నీళ్లు పోసి పెడితే.. డబ్బు ఇబ్బందులు రావు అంటూ ఒకళ్ళు చెప్తారు. మరొకరేమో ఏకం గా పర్సులో యాలకులు పెడితే డబ్బులు వస్తాయి అంటూ చెబుతుంటారు. ఇంకొందరేమో ఎర్రదరాన్ని, దాల్చిన చెక్కను బీరువాలో పెడితే.. కుప్పలు తెప్పలు గా డబ్బు వచ్చి చేరుతుందని చెబుతారు.

top trending trolls on elachi, erra daaram

 

ఇందులో చాలా వరకు నిజాలు ఉండవు. ఏదైనా మనం కష్టపడడాన్ని బట్టే ప్రతిఫలం కూడా లభిస్తుంది. అంతే తప్ప ఇలాంటి పనులు చేస్తే డబ్బులు పోతాయి.. అలాంటి వస్తువులు తీసుకొచ్చి బీరువాలో పెడితే డబ్బులు వస్తాయి లాంటి వీడియోలు చూసి మోసపోకండి. ఇలాంటి వీడియో లపై సోషల్ మీడియా లో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేయండి.

#1

#2

#3#4

#5#6

#7

#8

#9

#10