Ads
మనలో ఎంతో మంది ఒక చోట నుండి ఇంకొక చోటికి ప్రయాణించాలంటే ఉపయోగించే వాహనాలు ఇంకా ట్రైన్. ఒకవేళ తొందరగా వెళ్లిపోవాలి అంటే చాలా మంది ప్రిఫర్ చేసేది బస్ ప్రయాణాలు. కానీ ఒకవేళ టైం పట్టినా పర్లేదు అంటే మాత్రం ఎక్కువ మంది ట్రైన్ ప్రయాణాలనే ఇష్టపడతారు.
Video Advertisement
చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తూ ప్రయాణించడం, అందులోనూ ముఖ్యంగా రైలు ప్రయాణాలు అనేవి ట్రాఫిక్ కి దూరంగా ఉండడం వల్ల ప్రయాణికులు ట్రైన్ ప్రయాణాలని ఎక్కువగా ఇష్టపడతారు. అయితే, మనం రైల్వే స్టేషన్ కి వెళ్లే ఉంటాం. రైల్వే స్టేషన్ లో వచ్చే మ్యూజిక్ కానీ, అనౌన్స్మెంట్ కానీ మన అందరికీ ఇప్పటికీ మైండ్ లో తిరుగుతూనే ఉంటుంది.
ఎనౌన్స్మెంట్ కి ముందు ఒక మ్యూజిక్ వస్తుంది అది కూడా మన అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఆ మ్యూజిక్ మరొక చోట కూడా ఉపయోగించేవారు. ఆ సౌండ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టం 3.1 వెర్షన్ లో ఉపయోగించారు. పైన ఉన్నది విండోస్ ఆపరేటింగ్ సిస్టం స్టార్ట్ అయ్యే సౌండ్.
పైన ఉన్న వీడియో విండోస్ షట్ డౌన్ అయ్యే సౌండ్. ఈ సౌండ్ జాగ్రత్తగా వినండి. ఎక్కడో విన్నట్లు చాలా ఫెమిలియర్ గా ఉంది కదా? ఇప్పటికే మీలో చాలా మందికి గుర్తుకి వచ్చేసి ఉంటుంది. అవును. మనం రైల్వే స్టేషన్ లో అనౌన్స్మెంట్ కి వినే సౌండ్ ఇదే. ఇది విండోస్ 3.1 వెర్షన్ లో సిస్టం షట్ డౌన్ అయ్యేటప్పుడు వచ్చే సౌండ్. ఇదే సౌండ్ ని రైల్వే స్టేషన్ లో అనౌన్స్మెంట్స్ కి కూడా ఉపయోగిస్తారు.
End of Article