Ads
ఒక మనిషికి డబ్బు, ఉద్యోగం వీటన్నిటితోపాటు ముఖ్యమైనది ఆరోగ్యం అని అంటారు. ఒక రకంగా చెప్పాలంటే, అన్నింటికన్నా కూడా ఆరోగ్యం చాలా ముఖ్యమైనది అని అంటారు. ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా ఉంటేనే వారు ఎక్కువగా పని చేసి, వారికి కావలసినది సాధించగలుగుతారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఫిట్నెస్ మీద కూడా జనాలు చాలా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. కొంతమంది జిమ్ కి వెళ్లి ఎక్సర్సైజ్ చేస్తే, మరికొంతమంది వాకింగ్, జాగింగ్ వంటివి చేస్తారు. ఇంకొంతమంది సైక్లింగ్ లాంటివి చేస్తారు.
Video Advertisement
ఇవన్నీ కాకుండా, ఎంతో మంది యోగా చేయడంపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు. ఇవన్నీ చేయడం వల్ల శారీరకంగా ఫిట్ గా ఉండడం మాత్రమే కాకుండా మానసికంగా కూడా చాలా బలంగా తయారవుతారు. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఆహార విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు పాటిస్తారు. కేవలం వారి శరీరానికి సరిపడే ఆహారాన్ని మాత్రమే అది కూడా మితంగా తీసుకుంటారు. అయితే ఇన్ని పాటిస్తున్నా సరే ఒకసారి జిమ్ చేస్తున్నప్పుడు గుండెపోటు రావడం, పడిపోవటం వంటివి మనం తరచుగా చూస్తూ ఉన్నాం.
అయితే, ఇలా ఎందుకు అవుతుంది అనే విషయంపై ట్రైనర్లు మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు. ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి అని, రిజల్ట్ వెంటనే వచ్చేయాలి అని అనుకోకూడదు అని, ఫలితం రావడానికి ఎక్కువ సమయం పడుతుంది అని, అంతవరకు వేచి ఉండాలి అని చెప్పారు. అలాగే 30 రోజులు లేదా 60 రోజుల్లో బరువు తగ్గడం వంటి వాటిని నమ్మకూడదని, వాటి వల్ల బరువు తగ్గడం పక్కన పెడితే, ఆరోగ్య సమస్యలు ఇంకా పెరుగుతాయి అని చెప్పారు. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయంపై ఇంకా వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూడండి.
watch video :
End of Article