పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తోంది.
Video Advertisement
అయితే ఈ మూవీ టీజర్ రిలీజ్ అయినా తర్వాత చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నారు మేకర్స్. ఇప్పుడు మాత్రం వివాదాలకు అతీతంగా అందర్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా సీతా నవమి సందర్భంగా కృతిసనన్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు మేకర్స్. రామ్ సీతా రామ్ అంటూ.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో.. జానకిగా కృతీ సనన్ నారచీరలతో ఉన్న స్పెషల్ మోషన్ పోస్టర్ మంత్ర ముగ్ధులను చేస్తోంది.
జానకి పాత్రలో కృతి సనన్ పోస్టర్ స్వచ్ఛత, దైవత్వం, ధైర్యం ఉట్టిపడేలా కనిపిస్తోంది.ఈ లుక్ కు తగ్గట్టు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా సెట్ అవ్వడంతో.. ఈ పోస్టర్ చూడగానే భక్తి భావం ఉట్టి పడుతోంది. అలాగే అశోక వనంలో సీత బాధపడుతున్న సందర్భంలోని లుక్‌ను కూడా రిలీజ్ చేసారు.
ఇక ఈ మూవీ గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయంటూ దర్శకుడి పై ఓ రేంజ్ లో ట్రోల్స్ వచ్చాయి. దీంతో చిత్రయూనిట్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆ గ్రాఫిక్స్‌ను, విజువల్స్‌ను కాస్త బెటర్ చేసేందుకు ప్రయత్నించింది. గత ఏడాది ఎప్పుడో రావాల్సిన ఈ చిత్రం అంతకంతకూ ఆలస్యం అవుతోంది. ఇంతకు ముందు వచ్చిన టీజర్, పోస్టర్ పై ట్రోల్స్ వచ్చాయి కానీ..ఎక్కడ ఓడిపోయాడో.. ఎక్కడ ట్రోలింగ్ ఫేస్ చేసాడో అక్కడే తలెత్తుకు నిలబడ్డాడు దర్శకుడు ఓం రౌత్.
ఇప్పుడు సోషల్ మీడియాలో సీత పాత్రకు సంబంధించిన లుక్ వైరల్ అవుతోంది. అమరం, అఖిలం ఈ నామం, సీతారాముల ప్రియనామం అంటూ సీత పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లను విడుదల చేశారు. సీతగా కృతి సనన్ చక్కగా సరిపోయినట్టు కనిపిస్తోంది.
ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అద్భుతంగా ఉండేసరికి నెట్టింట మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18