అనుష్క శెట్టి మూడేళ్ల గ్యాప్‌ తర్వాత `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో `జాతిరత్నాలు` ఫేమ్‌ నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటిస్తున్నారు. దీంతో సినిమా ప్రకటించినప్పట్నుంచే దీనిపై ఆసక్తి, అంచనాలు నెలకొన్నాయి. మహేష్‌బాబు అనే నూతన దర్శకుడు దీన్నిరూపొందిస్తున్నారు.

Video Advertisement

ఈ సినిమాలో నవీన్.. సిద్ధు పోలిశెట్టి అనే స్టాండప్ కమెడియన్ గా, అనుష్క.. అన్విత రవళిశెట్టి అనే చెఫ్‌ పాత్రలో నటిస్తున్నారు. భాగమతి సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన అనుష్క మళ్ళీ ఇన్నాళ్లకు మరో ఆసక్తికరమైన సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది. అలాగే `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ`, `జాతిరత్నాలు` సినిమాలతో యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల చేత మంచి నటుడుగా ప్రశంసలు అందుకున్న నవీన్ పోలిశెట్టి కూడా కాస్త గ్యాప్ తీసుకొని ఈ చిత్రం తో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.

 

memes on miss shetty, mister polishetty movie teaser..!!
అనుష్క, నవీన్ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్లు వదిలి ఆకట్టుకుంటున్నారు. టైటిల్ పోస్టర్ కూడా ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ముగింపు దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేసారు మేకర్స్.

memes on miss shetty, mister polishetty movie teaser..!!

గతంలో వచ్చిన పోస్టర్ ను బట్టి హైదరాబాద్ లో ఉన్న పొలిశెట్టి, లండన్ లో ఉన్న అనుష్క శెట్టిని ఎలా కలిశాడు. ఆ కనెక్షన్ ఎంటనేదే కథగా తెలుస్తోంది. అలాగే టీజర్ అనౌన్స్ మెంట్ పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. స్టాడప్ కమెడియన్ గా నవీన్ పొలిశెట్టి ఎదుగుతున్నట్టుగా.. చెఫ్ గా అనుష్క కూడా ఎదుగుతున్నట్టు పోస్టర్లను బట్టి అర్థమవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్ ని విడుదల చేసారు.

 

ఇక తాజాగా రిలీజ్ అయిన టీజర్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..

#1


#2


#3


#4


#5


#6


#7


#8


#9


#10


#11

#12

watch video :