విజయ్ దేవరకొండ లైగర్ చిత్రానికి కొత్తగా నెటిజన్స్ పోస్ట్ చేస్తున్న మీమ్స్ వల్ల కష్టాలు వచ్చి పడ్డాయి. నిన్నటి వరకు బాలీవుడ్ స్టార్ హీరోలను వెంటాడి వేధించిన బాయ్‌కాట్ అంశం ఇప్పుడు విజయ్ దేవరకొండ సరికొత్త చిత్రం లైగర్ ను పట్టుకుంది. ఈనెల 25న విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా ఇప్పుడు మీమ్స్ తో సతమతమవుతోంది.

Video Advertisement

భారీ అంచనాలతో రిలీజ్ చేస్తున్న ఈ సినిమాపై ఎంతో ధీమాగా ఉన్నారు దర్శక నిర్మాతలు . అయితే ఈ క్రమంలో అనుకోని విధంగా బాయ్‌కాట్ లైగర్ అంటూ నెటిజెన్లు పెట్టే మీమ్స్ తో కొంత ఉత్కంఠత నెలకొంది. అయితే ఈ కామెంట్స్ ని మొదట్లో పెద్దగా పట్టించుకోని ఈ చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్ది కామెంట్స్ పెరగడంతో త్వరితగతిన జాగ్రత్తలు మొదలుపెట్టారు. రిలీజ్ కు దగ్గర అయిన నేపథ్యంలో సినిమాపై ఇలాంటి దుష్ప్రచారాలు సినిమా మీద ఎఫెక్ట్ చూపిస్తాయి ఏమో అని సినిమా యూనిట్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

trending memes on boycott liger

Also Read : “విజయ్ దేవరకొండ” మాటల వెనుక ఉద్దేశం ఏంటి..? ఫైర్ అవుతున్న “మహేష్ బాబు” ఫ్యాన్స్..!

ఇప్పటివరకు మంచి పాజిటివ్ ఇమేజ్ బిల్డ్ చేసుకున్న లైగర్ కు సడెన్ గా నెగిటివ్ మీమ్స్ తో వైరల్ కావడానికి కారణం ఎవరో తెలుసా….. కరణ్ జోహార్. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుట్ మరణం తరువాత సర్వత్ర నెపోటిజంపై ప్రేక్షకులు ధ్వజమెత్తి ఉన్నారు. బాలీవుడ్ లో వారసత్వానికి ప్రాముఖ్యత ఇచ్చే నిర్మాత కరణ్ జోహార్ కావడంతో అతని మీద మండి పడుతున్నారు. అందుకే రీసెంట్ గా బాలీవుడ్ అగ్ర నటుడు అమీర్ ఖాన్ సినిమాని కూడా బాయ్ కాట్ అంటూ ముప్పు తిప్పలు పెట్టారు. ఇక విషయానికొస్తే లైగర్ చిత్ర నిర్మాతల్లో కరణ్ జోహార్ కూడా ఒకరు…. దాంతో ఇప్పుడు నెటిజెన్లు లైగర్ మీద ధ్వజమెత్తారు అని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలో విడుదలయ్యే ఈ సినిమా కు వీళ్ళ ప్రచారం వల్ల లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అన్నది మాత్రం వేచి చూడాలి.

#1

#2

#3

#4

#5

Also Read : “లైగర్” సినిమా సెన్సార్ కట్‌లో తొలగించబడిన… 5 సీన్స్/ పదాలు ఇవే..!

#6

#7

#8#9#10#11#12#13

Also Read : “లైగర్” సినిమా కోసం… వీరి “రెమ్యూనరేషన్” ఎంతో తెలుసా..? అందరికంటే ఎక్కువ ఎవరికంటే..?

#14#15#16#17#18#19#20

Also Read : సీతా రామం సినిమాలో “భూమిక కూతురి” గా నటించిన ఈ పాప ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?